HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >If You Carelessly Place These Items On The Floor You Will Face Financial Loss

‎Spiritual: పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

‎Spiritual: పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 29-11-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Spiritual
Spiritual

‎Spiritual: మామూలుగా మనం ఇంట్లో తరచుగా దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం. అయితే పూజ చేసే సమయంలో తెలిసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అయితే మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించవచ్చట. ఇంట్లో సమస్యలు కూడా పెరిగిపోతాయని చెబుతున్నారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట. కాగా ఇంట్లో తరచుగా దీపారాధాన చేయడం చాలా మంచిది. దీపం నుంచి వెలువడే కాంతి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుందని చెబుతుంటారు.
‎
‎దీపం మానవ జీవితంలోని అన్ని సమస్యలను కూడా తొలగిస్తుందట. అంతేకాదు జీవితాన్ని కాంతితో నింపుతుందట. కాబట్టి దీపం వెలిగించడం దేవుడిని పూజించడంలో అంతర్భాగంగా పరిగణిస్తారు. అయితే దీపారాధన చేయడానికి ముందు దీపాలను నేల మీద పెట్టకూడదట. దీపాన్ని ఎల్లప్పుడూ ఒక ట్రేలో ఉంచాలని, తర్వాత ఏదైనా ఆకు ఉంచి దాని మీద దీపాన్ని ఉంచాలట. ఇలా చేయకపోతే ఇంట్లో డబ్బు నష్టం చాలా ఎక్కువగా ఉంటుందట. శివలింగాన్ని చాలా మంది ఇంట్లో పూర్తి భక్తితో పూజిస్తారు. శివుడు మొత్తం విశ్వం శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి మీరు పొరపాటున కూడా శివలింగాన్ని నేలపై ఉంచితే, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడం ప్రారంభమవుతుందట.
‎
‎కాబట్టి శివలింగాన్ని ఎప్పుడూ నేలపై ఉంచకూడదట. తెల్లటి వస్త్రంపై శివలింగాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణిస్తారని చెబుతున్నారు. ఇంట్లో దేవుడి విగ్రహం ఉంటే పూజ గదిలో విగ్రహాన్ని కూడా ఎంతో గౌరవంగా ప్రతిష్టిస్తారు. కాబట్టి దేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ నేలపై ఉంచకూడదట. దేవుడి విగ్రహాన్ని నేలపై ఉంచడం వల్ల ఆయన అవమానం జరుగుతుందట. దీని వల్ల ఇంటి శాంతికి భంగం కలుగుతుందని చెబుతున్నారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రజలు తరచుగా దేవుడి విగ్రహాన్ని నేలపై ఉంచుతారు. కానీ అలా చేయడం తప్పట. ఆలయాన్ని శుభ్రపరిచేటప్పుడు, విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఒక వస్త్రం లేదా ట్రేపై ఉంచాలట. శుభ్రం చేసిన తర్వాత, దానిని పూజ గదిలో తిరిగి అక్కడే ఉంచాలట. అదేవిధంగా నేలపై బంగారు ఆభరణాలను ఉంచడం విష్ణువుతో సహా అన్ని దేవుళ్ళను అవమానించడమే అని చెబుతున్నారు. విష్ణువు అవమానించకుండా, అతని ఆశీర్వాదాలు నిలిచి ఉండటానికి బంగారు ఆభరణాలను ఎప్పుడూ పాదాలకు ధరించకూడదట. నేలపై బంగారాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందట. అందువల్ల, ఎల్లప్పుడూ బంగారు ఆభరణాలను ఒక వస్త్రంలో చుట్టి సురక్షితమైన స్థలంలో ఉంచాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • mistakes
  • spiritual
  • spirituality

Related News

Today Gold Silver Prices

Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

బంగారం ధరలు చుక్కలు చూపిస్తుంటే.. వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చింది. అనూహ్యంగా ఒక్కరోజులోనే కేజీ వెండిపై రూ. 10,000 తగ్గడం విశేషం

    Latest News

    • భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

    • హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • రింకూ సింగ్ తండ్రి మృతికి కార‌ణ‌మైన లివర్ క్యాన్సర్‌.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    Trending News

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

      • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

      • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

      • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd