Papaya Plant: మీ ఇంటి ముందు కూడా బొప్పాయి చెట్టు ఉందా.. అయితే ఆర్థిక ఊబిలో కూరుకుపోవడం ఖాయం!
Papaya Plant: వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు బొప్పాయి మొక్క ఉండడం అంత మంచిది కాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Mon - 1 December 25
Papaya Plant: మామూలుగా మనం వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఇంటిముందు బాల్కనీలో రకరకాల మొక్కలను చెట్లను పెంచుకుంటూ ఉంటాము. అయితే ఇది మంచి విషయమే అయినప్పటికీ కొందరు తెలిసి తెలియక కొన్ని రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
అటువంటి బొప్పాయి మొక్క ఇంటి ముందు పెంచడం కూడా ఒకటి. మరి బొప్పాయి మొక్కను ఇంటి ముందు పెంచితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా విత్తనం పడి చెట్టు మీ ఇంటి ముందు పెరిగినా కూడా,ఆ మొక్కను పీకి వేరే చోట నాటాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే దాంతో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందట.
ఆర్థిక ఊబిలో కూడుకుపోవడం ఖాయం అని చెబుతున్నారు. అలాగే బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు. అంతేకాదు ఇంటి ముందు, ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు వస్తాయట. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని అంటున్నారు. వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదట. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారట. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు. అంతేకాదు,