Peepal Leaves: రావి ఆకుపై నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Peepal Leaves: రావి చెట్టు యొక్క ఆకుపై ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:15 PM, Sun - 16 November 25
Peepal Leaves: హిందువులు రావి చెట్టును పవిత్రంగా భావించడంతోపాటు భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా శనివారం రోజు నువ్వుల నూనెతో రావి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల చాలా మంచిదని అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. అలాగే రావి ఆకుతో అనేక పరిహారాలు పాటించడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.
కొన్ని ప్రదేశాలలో రావి ఆకులను పూజలో కలశంలో తమలపాకులకు బదులుగా రావి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే రావి చెట్టు ఆకులో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు పండితులు. ఆ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది అన్న విషయం మనందరికీ తెలిసిందే. శాపాలు దోషాలతో పాటుగా పూర్వజన్మ కర్మ ఫలాలను కూడా రావి చెట్టు తొలగించగలదు.
అందుకోసం మీరు చేయాల్సిందల్లా రావి చెట్టుని పూజించడమే. తరచుగా రావి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజించే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు. అంతేకాకుండా మన ఇంట్లోని పూజ గదిలో రావి ఆకుల పైన ప్రమిదలను పెట్టి దీపారాధన చేయడం వల్ల శాపం, దోష కర్మ ఫలితాలు ఉండవు అని చెబుతున్నారు. ఇందుకోసమా ముందుగా రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి శుభ్రంగా కడగాలి. తర్వాత కుంకుమ పసుపు బొట్లతో అలంకరించాలి. తర్వాత ఆ ఆకుపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు పూర్తి అవుతాయట. చేసే పనుల్లో కూడా విజయం లభిస్తుంది అని చెబుతున్నారు.