Hanuman Jayanti : కొండగట్టుకు పోటెత్తిన హనుమాన్ భక్తులు
కొండగట్టు పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి
- Author : Sudheer
Date : 23-04-2024 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్బంగా తెలంగాణ లోని కొండగట్టు (Kondagattu Hanuman Temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంజన్న దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. కొండగట్టు పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఉదయాన్నే కోనేటిలో స్నానం ఆచరిస్తున్నారు. నేడు చైత్ర పౌర్ణమితోపాటు అంజన్నకు ఇష్టమైన మంగళవారం కావడంతో పంచామృత అభిషేకం, సహస్ర నాగావళి దళార్చన పూజలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 15 కీలో మీటర్ల దూరంలో మలయాళ మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గర్లోని కొండగట్టు మీద ఈ ఆలయం కొలువుదీరి ఉంది. ఇక్కడ హనుమాన్ రూపం చాలా మహిమాన్వితమైంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. చాలా అరుదైన రూపం కూడా.. చాలా ప్రాంతాలలో ఏక రూపంలో కనిపించే హనుమంతుడు కొన్ని చోట్ల త్రిముఖాలు, మరికొన్ని చోట్ల పంచ ముఖాలతో దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం కాగా మరొకటి నారసింహ స్వామి ముఖం. రెండు ముఖాలతో నారసింహ శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతామాతలతో కూడిన రూపం ఇక్కడి ఆండనేయుడి ప్రత్యేకత. అందుకే కొండ అంజన్న అంటే అందరికి అంత భక్తి… నమ్మకం .. దైర్యం. ఆయన ఆశీర్వాదం లభించిందంటే చాలు కొండంత ధైర్యం వచ్చింనట్లేనని నమ్ముతుంటారు. ఆంజనేయుడి మూల మూర్తి దర్శనంతో భూతప్రేత పిశాచాల పీడల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. నిత్య అభిషేకాలు, వార్షిక ఆరాధన ఉత్సవాలు,శ్రీరామ నవమి, ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
Read Also : Quiet Firing: క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఉద్యోగాలలో ఇదొక కొత్త ట్రెండ్!