Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతం రోజు ఆవు నెయ్యితో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండిలా!
వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యి పాయాసం సమర్పిస్తే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Fri - 16 August 24

శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16 అనగా నేడు జరుపుకోనున్నారు. అయితే కేవలం నేడు మాత్రమే కాకుండా శ్రావణమాసంలో ఏ శుక్రవారం రోజు అయినా సరే వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మహిళలకు కొన్ని రోజుల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ వారం కుదరకపోతే మళ్లీ వారం అయినా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే..
వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే రక రకాల పువ్వులను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో ఆవు నెయ్యితో తయారుచేసిన పాయసం అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే తెలుపు రంగులో ఉన్న వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ ఆవు నెయ్యితో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. మరి ఆ పాయసాన్ని ఎలా చేయాలి దానికి ఏ ఏ పదార్థాలు కావాలి అన్న విషయానికి వస్తే.. పాలు,సేమియా, పంచదార, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఆవు నెయ్యి, నీరు యాలకులను సరైన మోతాదులో తీసుకోవాలి. కాగా సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే కట్ చేసిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకొని, ఆ తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
అందులో నెయ్యి వేసి సేమియాను బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించి, తర్వాత అందులోనే నీరు పోసి సేమియా ఉడికించుకోవాలి. మీకు పాలు ఎక్కువగా ఉంటే పాలు పోసి సేమియాను ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత అందులోనే చక్కెర వేసుకోవాలి. అది కరిగే వరకు బాగా కలపాలి. చక్కెర అంతా కరిగి సేమియా ఉడికిన తర్వాత అందులో పాలు పోయాలి. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. అందులోనే యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి బాగా కలపాలి. లేదంటే పాలు పొంగినప్పుడు పై నుంచి నెయ్యి కూడా వేసుకుని మరో 10 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యి పాయసం రెడీ. ఈ వాయిస్ అన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. అలాగే అమ్మవారు సంతోషించి మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుందట.