August Horoscope : ఆగస్టు నెల రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శత్రుగండం
జులై నెల ముగియవస్తోంది. ఇక ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది.
- By Pasha Published Date - 09:38 AM, Tue - 30 July 24

August Horoscope : జులై నెల ముగియవస్తోంది. ఇక ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెలలో కొన్ని రాశుల వారికి గ్రహ సంచారం బాగుంది. ఇంకొన్ని రాశుల వారికి ఆగస్టులో అప్పులు తీరబోతున్నాయి. మరికొన్ని రాశులవారికి జాబ్ ప్రమోషన్ లభించనుంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
మేష రాశి (Aries)
ఆగస్టు నెల ప్రారంభంలో మేషరాశివారికి పరిస్థితులు బాగానే ఉంటాయి. కానీ నెల చివర్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. వాహనం కొనుగోలు చేయాలన్న కోరిక ఫలిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందగలరు.
వృషభ రాశి (Taurus)
ఆగస్టు నెలలో సుదీర్ఘకాల సమస్యలకు వృషభ రాశివారు పరిష్కారాన్ని పొందుతారు. వ్యాపారులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలే వస్తాయి. కొత్త పరిచయాలు కలిసొస్తాయి.
మిథున రాశి (Gemini)
ఆగస్టు నెలలో మిథున రాశి వారికి అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి , వ్యాపారం, ఉద్యోగంలో వృద్ధి చోటుచేసుకుంటుంది. వాటి కోసం మీరు కొత్త ప్రణాళికలు వేస్తారు.
Also Read :ITR Filing Deadline: రేపే లాస్ట్.. లేదంటే రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..!
కర్కాటక రాశి (Cancer )
ఆగస్టు నెలలో కర్కాట రాశిలోని పురుషులకు స్త్రీ మూలక ధనలాభం కలుగుతుంది. కొత్త పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo)
ఆగస్టు నెలలో సింహ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు జరగకపోవచ్చు., దేనిపైనా శ్రద్ధ కుదరదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే ఛాన్స్ ఉంది.
కన్యా రాశి (Virgo)
ఆగస్టు నెలలో కన్యారాశి వారు తలపెట్టే పనులు కలిసి రాకపోవచ్చు. అపనిందలు, అవమానాలు ఎదురుకావచ్చు. మీరు నమ్మిన వారే మోసం చేసే ముప్పు ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి.
తులా రాశి (Libra)
ఆగస్టు నెలలో తులా రాశివారికి భూ సంబంధిత విషయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మొండిబాకీలు వసూలు అవుతాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారు వాహనాలు కొంటారు. ఉద్యోగులకు బదిలీలు లేదా ప్రమోషన్‌కు సంబంధించిన సమాచారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఆగస్టు నెలాఖరులో ధనస్సు రాశివారికి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. గతంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ప్రయాణాలు కలిసొచ్చే అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు.
మకర రాశి (Capricorn)
ఆగస్టు నెలలో మకర రాశివారు అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు. శత్రువులు క్రియాశీలంగా మారే ముప్పు ఉంది. అప్రమత్తంగా ఉండటం మంచిది. ధైర్యంగా ఎదుర్కోవాలి.
కుంభ రాశి (Aquarius)
ఆగస్టు నెలలో కుంభరాశి వారికి అపనిందలు, అవమానాలు ఎదురవుతాయి. డబ్బులు చేతిలో మిగలవు. చేయాలనుకున్న పనులు చేయలేరు. సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
Also Read :Team India: టీమిండియాలో మార్పులు మొదలుపెట్టిన గంభీర్.. న్యూ ప్లాన్‌తో బరిలోకి..!
మీన రాశి (Pisces)
ఆగస్టు నెలలో మీన రాశి వారికి కొన్ని పరాజయాలు లభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.