HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Holi 2024 Eco Friendly And Safe Holi Celebration Tips At Home

Holi 2024: హోలీ పండుగ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పాటించకపోతే అంతే సంగతులు?

దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండుగను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగాను

  • Author : Anshu Date : 12-03-2024 - 9:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1676973083924
1676973083924

దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండుగను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగాను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. హోలీ పండుగ ఆనందం, వినోదానికి ప్రసిద్ధి. అందుకే అందరూ హోలీ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ హోలీ పండుగ సంబరాల్లో మునిగిపోవాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న అజాగ్రత్తల కారణంగా హోలీ సంబరాలు చెడిపోతాయి.

కనుక హోలీ పండుగ మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే కలిగించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మరి అలాంటప్పుడు హోలీ పండుగ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ ఉపయోగించాలి.. రంగులతో హోలీ ఆడే ముందు చర్మం బాగా తేమగా ఉండటం ముఖ్యం. తద్వారా చర్మం నుండి రంగు పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే పొడి చర్మంపై రంగును జల్లుకుంటే శుభ్ర పరుచుకునే సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రంగులు చర్మంపై ఉండిపోతాయి. కనుక హొలీ ఆడుకునే ముందు చర్మం పొడిగా ఉండకుండా తేమ ఉండేలా మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ వాడాలి.

తద్వారా చర్మం తేమగా ఉంటుంది. హోలీ రంగులు సులభంగా శుభ్రం చేసుకోచ్చు. అలాగే జుట్టును రంగులలో కలిపిన ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షించడానికి తలను స్కార్ఫ్ లేదా క్యాప్‌తో కప్పుకోండి. ఇవి రంగులలో కలిపిన రసాయనాలు జుట్టుకు చేరకుండా నిరోధిస్తుంది. చర్మాన్ని రంగుల నుండి రక్షించుకోవడానికి వాటర్ ప్రూఫ్ లేదా ఫుల్ స్లీవ్ దుస్తులను మాత్రమే ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంగుల నుండి రక్షించబడుతుంది.అలాగే కళ్లకు రంగులు, రసాయనాలు వలన ఇబ్బంది కలగకుండా కాపాడుకోవాలంటే హోలీ రోజున కళ్ల జోడు ధరించాలి. ఇవి కళ్ళను రంగుల నుండి కాపాడుతుంది. రంగు నీటితో నిండిన బుడగలు కొన్నిసార్లు చాలా హానికరం. ఈ బెలూన్‌లు ఎవరి ముఖానికి అయినా దూరం నుంచి తగిలితే కళ్లు, చెవులు దెబ్బతింటాయి. అందువల్ల ఎల్లప్పుడూ వాటర్ బెలూన్‌ల వినియోగానికి దూరంగా ఉండండి. హోలీ రోజున చిన్న పిల్లలను ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వద్దు. మార్కెట్లో వివిధ రకాల రసాయన రంగుల ప్రాబల్యం పెరిగింది. అయితే ఈ రంగులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఎల్లప్పుడూ సహజ రంగులతో మాత్రమే హోలీ ఆడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Holi 2024
  • Holi Celebrations
  • Holi festival
  • house

Related News

Anasuya Aunty

Anasuya : ‘ఆంటీ’ అనగానే అనసూయ కు ఎక్కడో కాలింది !!

హైదరాబాద్‌లో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న అనసూయకు కొందరు ఆకతాయిల వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్టేజీపై మాట్లాడుతుండగా, కింద ఉన్న కొందరు యువకులు కావాలనే ఆమెను రెచ్చగొట్టేలా 'ఆంటీ ఆంటీ' అంటూ కేకలు వేశారు

  • Holi Celebrations In Hunsa

    Holi : అక్కడ హోలీ పండగంటే..ఆ గ్రామంలో రక్తం ప్రవహించాల్సిందే !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd