Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పూలతో పూజిస్తే చాలు… కాసుల వర్షం కురవాల్సిందే!
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకున్న వారు అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అడుగుపెట్టడంతో పాటు కాసుల వర్షం కురిపిస్తుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:03 AM, Sun - 15 December 24

మామూలుగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం కలగలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కలగకపోవడానికి మనం చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా కారణం కావచ్చు అని చెబుతున్నారు పండితులు. ఆ సంగతి పక్కన పెడితే అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు.
లక్ష్మీదేవిని పూలతో ఆరాధించడం ద్వారా శ్రేయస్సు, ధనసమృద్ధి, కుటుంబంలో ఆనందం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. మరి అమ్మవారికి ఇష్టమైన పూలు ఏవి?అమ్మవారిని ఎలా పూజించాలి? అన్న విషయానికి వస్తే.. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవిని తామర పువ్వు తో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులలో మందార పువ్వు కూడా ఒకటి. మందార పువ్వును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని, అమ్మవారి అనుగ్రహం ఆ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు. అలాగే గులాబీ పువ్వులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం.
గులాబీ పువ్వులతో పూజ చేయడం వల్ల తప్పక లక్ష్మి అనుగ్రహం కలుగుతుందట. మల్లె పువ్వులు అన్న కూడా అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవిని మల్లెపువ్వులతో పూజించడం వల్ల అమ్మ సంతోషించి అమ్మవారి అనుగ్రహం ఎవరు కలిగేలా చేస్తుందట. లక్ష్మీ పూజలో తులసి మొక్కను పూజించడం కూడా చాలా మంచిది. తులసి ఆకులను వినియోగించిన కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట. అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలలో పారిజాతం పూలు కూడా ఒకటి. ఈ పూలను సమర్పించినా కూడా అమ్మవారి ఆశీర్వాదం తప్పక కలుగుతుందట.