Alum: చిన్న స్పటికతో బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు అన్ని సమస్యలకు పరిష్కారం.. ఎలా అంటే?
Alum: చిన్న స్పటిక ముక్కను ఉపయోగించి మన ఇంట్లో ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి సమస్యలను తగ్గించుకోవడానికి స్పటికతో ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sun - 7 December 25
Alum: స్పటిక వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ స్పటికను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే స్పటికను మన ఇంట్లోని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు చాలా రకాల సమస్యలకు స్పటిక బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి స్పటికను ఉపయోగించి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్పటికంలో ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి మీరు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నీటిగా కొద్దిగా స్పటికను వేసుకొని ఇల్లు క్లీన్ చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు నశిస్తాయట. ఇంట్లో కలహాలు ఉండవు అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా చేస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయట. దుకాణం, వ్యాపార స్థలాలలో తగ్గినట్టు అనిపిస్తే, మీ వ్యాపారానికి దిష్టి తగిలినట్టుగా మీకు అనిపిస్తే ఒకటి నల్లటి బట్ట తీసుకొని అందులో స్పటికను వేసి మీ వ్యాపార స్థలాలలో ఎదురుగా తగిలించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వస్తుందట.
ఆదాయం కూడా జరుగుతుందని చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగి మనస్పర్ధలు వస్తున్నట్లయితే, అలాగే మనశాంతి లేదు అనుకున్నవారు స్పటికను ఒక నల్లటి బట్టలో చుట్టి మంచం కింద ఉంచాలట. ఇలా చేయడం వల్ల ఇది వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలను తొలగిస్తుందట. అదేవిధంగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు స్నానం చేసే నీటిలో కొంచం స్పటిక కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయట.