Friday: శుక్రవారం రోజు ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శుక్రవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట.
- By Anshu Published Date - 11:00 AM, Fri - 9 August 24

శుక్రవారం రోజు లక్ష్మి దేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు పరిహారాలు వ్రతాలు నోములు కూడా ఆచరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు అమ్మవారి అనుగ్రహం లభించదు. కానీ శుక్రవారం రోజు కొన్ని పరిహారాలు తప్పకుండా పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు ఆ ఇంట కాసుల వర్షం కురుస్తుందని చెబుతున్నారు. మరి శుక్రవారం రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం నాడు ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే లక్ష్మీ దేవిని రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలట.
ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు. అలాగే
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని మల్లె పువ్వులతో సుగంధ పరిమళాలతో పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందట. తామరపువ్వులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తామరపూవుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయట. కాగా లక్ష్మీదేవి సువాసనతో కూడిన ఉత్పత్తులను ఇష్టపడుతుంది. కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మంచి సువాసనగల గంధాన్ని సృష్టించడం ద్వారా అదృష్టం పెరుగుతుందట.
శుక్రవారం నాడు ఉదయం, సాయంత్రం కర్పూరంతో అష్ట రకాల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలని చెబుతున్నారు. లక్ష్మీదేవికి ఇలా చేస్తే చాలా ఇష్టమట. అలా లక్ష్మీదేవి మనసు చల్లబడి ఆమె అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గంద సుగంధ పరిమాణాలను ఉపయోగిస్తే మీరు వెళ్లే పనిలో పురోగతిని చూడవచ్చట. ప్రతి శుక్రవారం ఆవుకు పచ్చి గడ్డి లేదా ఎండుగడ్డి ఇవ్వడం మంచిది. అలా లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబం మొత్తానికి లభిస్తుందట. శుక్రవారం రోజున చిన్న కొబ్బరికాయను పసుపు గుడ్డలో చుట్టి ఇంటి వంటగది తూర్పు మూలలో వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో తిండికి, డబ్బుకు లోటు ఉండదని చెబుతున్నారు.