Karthika Masam: విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే కార్తీక మాసంలో ఇలా చేయాల్సిందే!
కార్తీక మాసంలో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తూ పూజలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట.
- By Anshu Published Date - 12:03 PM, Thu - 31 October 24

మరో రెండు రోజుల్లో కార్తీకమాసం మొదలు కానుంది. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అన్న విషయం తెలిసిందే. అలాగే విష్ణుమూర్తి ని కూడా చాలామంది పూజిస్తూ ఉంటారు. ఈ మాసాన్ని కార్తీక మాసం అనే కాకుండా దామోదర మాసం అని కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు సుదీర్ఘ విశ్రాంతి తర్వాత మేల్కొని శుభసమయం ఇదే. ఈ కార్తీక మాసంలో విశేష పూజలు చేసే వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా కార్తిక మాసంలో పవిత్ర స్నానాలు ఆచరించి దీపాలను వెలిగించడం అన్నది తప్పనిసరి.
ఈ మాసంలో మహావిష్ణువును, కృష్ణుడిని పూజిస్తారు. ఈ మాసం ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో భక్తులు ధ్యానం చేయడం, బ్రహ్మ ముహూర్తంలో లేవడం, ఆధ్యాత్మిక అభ్యాసం చేయడం, ఆలయానికి వెళ్లడం వంటి వివిధ మత, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని చెబుతున్నారు. బ్రహ్మముహూర్తంలోనే ఆలయానికి వెళ్లి కార్తీక మాసం కథ వింటే మంచిదట. ఈ మాసంలో విష్ణుమూర్తితో పాటుగా శ్రీకృష్ణుడిని కూడా పూజించడం మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఈ మాసంలో సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయట.
కాగా కార్తీక మాసంలో గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించడం ఫల ప్రదంగా భావిస్తారు. కార్తీక మాసంలో విష్ణుమూర్తికున్న వివిధ నామాలను పఠించడం శుభప్రదంగా భవిస్తారు. ఈ మాసంలో చాలా మంది నెలరోజుల పాటు సాయంత్రం ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తుంటారు. ఎందుకంటే ఇది దేవుడికి అంకితం చేయబడిన ధ్యానం వంటిది కాబట్టి, అలాగే ఈ మాసంలో పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఈ మాసంలో తులసి దేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజూ విష్ణుమూర్తికి తులసి నీటిని సమర్పించాలని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని ఖచ్చితంగా వెళిగించాలి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.