Spiritual: గోమాతకు వీటిని ఆహారంగా పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
గోమాతకు ఎలాంటి ఆహార పదార్థాలు తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:00 AM, Sat - 28 September 24

భారతదేశంలో నివసించే హిందువులకు ఆవులకు అవినాభావ సంబంధం ఉంది. ఆవులనే గోవులు గోమాత అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా వాటికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గోశాల అని పెద్దపెద్ద గోశాలలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని, అలాంటి గోమాతకు పూజలు చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఆవుకి పూజ చేయడం మంచిదే కానీ పూజ చేయడంతో పాటుగా కొన్ని రకాల వస్తువులను ఆహారంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
మరి గోమాతకు వేటిని ఆహారంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల ఆధ్యాత్మిక చింతన కలుగుతుందట. శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు ఆహారంగా పెట్టడం వల్ల శత్రుభయం తొలగిపోతుందట. శత్రు నివారణ కూడా జరుగుతుందని చెబుతున్నారు. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించడం వలన రుణ విముక్తి కలుగుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడుతూ ఉండేవారు నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు తినిపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. పిల్లలు విద్యారంగంలో రాణించాలి ఎదగాలి అని కోరుకుంటున్న తల్లిదండ్రులు గోమాతకు నాన బెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు.
అలాగే గోమాతకి నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందట. అలాగే ఉద్యోగం రాకుండా ఉన్నవారు, ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వారు గోమాతకి గోధుమపిండి, బెల్లము కలిపి పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే వివాహం కాని వారు గోమాతకి టమాటాలను తినిపిస్తే మంచి ఫలితం వస్తుందట. ఆత్మవిశ్వాసం కోసం నానబెట్టిన మినములు పెట్టడం వల్ల ఆత్మవిశ్వాసం లభిస్తుందట. గోమాతకు బీట్రూట్ అలాగే పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారని చెబుతున్నారు. అలాగే నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాట. నానబెట్టిన బొబ్బట్లు గోమాతకు పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుందని, అలాగే నానబెట్టిన ఉలవలు ఆహారంగా పెడితే వృత్తిలో నిలకడ లభించి సమాజంలో మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. అలాగే కొంచెం నీటిలో కలిపిన బియ్యం పిండిని గోమాతకు తినిపిస్తే ప్రశాంతత లభిస్తుందట.