Dussehra 2022: దసరా రోజు ఈ పనులు అస్సలు చెయ్యకండి.. చేస్తే దరిద్రం పట్టినట్టే!
Dussehra 2022: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా నేటితో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. ఇకపోతే రేపు అనగా అక్టోబర్ 5న దసరా పండుగను జరుపుకుంటారు. దసరాను, విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 06:30 AM, Wed - 5 October 22

Dussehra 2022: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా నేటితో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. ఇకపోతే రేపు అనగా అక్టోబర్ 5న దసరా పండుగను జరుపుకుంటారు. దసరాను, విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి చిహ్నంగా ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఆదిపరాశక్తి అయినా దుర్గామాత ఆ మహిషాసురుడు అనే రాక్షసుడుని సంహరించి ముల్లోకాలను రక్షించినందుకు భక్తులు దుర్గ మాతను తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
అయితే దసరా పండుగ రోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. దసరా పండుగ అనగా 10వ రోజు దశమినాడు విజయదశమి పండుగను అమ్మవారిని నియమనిస్తులతో పూజించి అమ్మవారి కటాక్షం పొందాలి అనుకున్న వారు కొన్ని పనులను చేయకూడదు. పొరపాటున కూడా మాంసాన్ని ముట్టకూడదు. అలాగే పండుగ రోజు మాంసం తినడం వల్ల నవరాత్రుల్లో దేవి కృప కోసం చేసిన పూజాఫలం మొత్తం బూడిదల పోసిన పన్నీరు అవుతుంది.
అలాగే ఇంట్లో ఒకవేళ అఖండ జ్యోతిని వెలిగించినట్లు అయితే ఆ ఇంట్లో ఎవరూ ఒకరు తప్పనిసరిగా ఉండాలి. జ్యోతిని వెలిగించిన తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం మంచిది కాదు. అదేవిధంగా దసరా పండుగ రోజు మాంసాహారం తో పాటు వెల్లుల్లి ఉల్లిపాయను కూడా వినియోగించకూడదట. అదేవిధంగా నిమ్మకాయను కూడా కోయకూడదు అని పండితులు చెబుతున్నారు. వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం పొందడం విషయం పక్కన పెడితే దరిద్రం చుట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ విజయదశమి రోజున మాంసాహారాన్ని భుజించకూడదు.