Vastu-Tips : ఇంట్లో హనుమంతుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలో తెలుసా..? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!
హిందువులు...వారి ఇళ్లల్లో ఖచ్చితంగా దేవుళ్ల ఫొటోలను ఉంచుతారు. తమకు ఇష్టమైన దైవం ఫొటోలను గోడలకు వేలాడదీస్తుంటారు. లేదంటే పూజగదిలో ఉంచుతారు. హనుమాన్ ఫొటో ఉంటే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావని విశ్వసిస్తారు.
- By hashtagu Published Date - 07:43 AM, Sun - 3 July 22
హిందువులు…వారి ఇళ్లల్లో ఖచ్చితంగా దేవుళ్ల ఫొటోలను ఉంచుతారు. తమకు ఇష్టమైన దైవం ఫొటోలను గోడలకు వేలాడదీస్తుంటారు. లేదంటే పూజగదిలో ఉంచుతారు. హనుమాన్ ఫొటో ఉంటే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావని విశ్వసిస్తారు. చాలా ధైర్యంగా ఉంటుందని చెబుతుంటారు. ఆంజనేయుడు భక్తులపై సకలదేవతల ఆశీస్సులు ఉంటాయని నమ్ముతుంటారు. హనమాన్ ను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాదు…ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతుంటారు. అందుకే హిందువుల్లో చాలామంది తమ ఇంట్లో హనుమాన్ ఫొటోను ఉంచుతారు.
కాగా వాస్తుప్రకారం..హనుమాన్ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అశ్రద్ధ చేస్తే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బుందులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడికి సంబంధించిన ఎన్నో రకాల ఫొటోలు మనం చూస్తూంటాం. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్లే ఫొటో , రామలక్ష్మణుడిని తన భుజాలపై తీసుకెళ్తున్న ఫొటో, ఛాతిని చూపిస్తున్న ఫొటోలు ఇలా ఎక్కువగా కనిపిస్తాయి.అయితే వాస్తు నిపుణుల సలహా ప్రకారం…హనుమంతుడికి సంబంధించిన కొన్ని ఫొటోలనే ఇంట్లోనే ఉంచుకోవాలి. కొన్నింటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అవేంటో చూద్దాం.
1. వాస్తు ప్రకారం హనుమంతుడు ఛాతీని చూపించే చిత్రాన్ని ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచకూడదని కొందరు నమ్ముతుంటారు. ఇలాంటి ఫొటోలు ఉంటే ఇంట్లో మంచిది కాదు. ఇబ్బందులు తలెత్తుతాయి.
2. హనుమాన్ గాల్లో ఎగురుతున్న లేదా పర్వతాన్ని ఎత్తే చిత్రాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు. ఈ ఫొటో ఇంట్లో ఉంటే అశుభమట.
3.శ్రీరాముడు, లక్ష్మణుడిని భుజాలపై కూర్చోబెట్టుకున్న ఫొటోలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉంచుతే చెడు ప్రభావాన్ని చూపుతాయట.
ఎలాంటి చిత్రపటాలు ఉంచాలి…
1. వాస్తుప్రకారం పసుపు దుస్తులు ధరించిన హనుమంతుడి చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందట. పసుపు, సింధూరమంటే హనుమాన్ కు ఎంతో ఇష్టమని హిందువులు విశ్వసిస్తారు.
2. హనుమాన్ కూర్చున్న భంగిమలో ఉన్న ఫొటోలు కూడా ఇంట్లో ఉంటే మంచివట. ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉంచితే సానుకూల వాతావరణం కల్పిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇలాంటి ఫొటోలను పెట్టుకుంటే…అన్ని విధాల మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.
Related News
Sai Durga Tej : కొత్త దర్శకుడితో మెగా మేనల్లుడు.. ఆ సినిమా పరిస్థితి ఏంటో..?
Sai Durga Tej విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా సినిమా అన్ని వర్గాల