Saturday: సంపదలు కలిగి సమస్యలు తీరిపోవాలంటే శనివారం రోజు ఎలాంటి వస్తువులు దానం చెయ్యాలో మీకు తెలుసా?
శనివారం రోజు ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల వస్తువులును దానం చేయడం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 11:30 AM, Tue - 6 May 25

దానధర్మాలు చేయడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దానాలలో అనేక రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం డబ్బు దానం వస్త్ర దానం అవయవ దానం రక్తదానం ఇలా చాలానే ఉన్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం వల్ల తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్మకం.
మనం చేసే దానధర్మాలు మంచి చెడు పనులు మన కష్ట కాలంలో మనకు చాలామంది ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాడు. ఇకపోతే మన కష్టాలు తొలగిపోయి సంపదలు కలిగి సమస్యలు తీరిపోవాలి అంటే శనివారం రోజు ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల వస్తువులను దానం చేయడం మంచిది అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ శనివారం రోజు ఎలాంటి వస్తువులను దానం చేయాలి అన్న విషయానికి వస్తే.. శనివారం రోజు ఇనుప వస్తువులను దానం చేస్తే జాథకంలో శని దోషం తొలగిపోయి ఆకస్మిక మరణం సంభవించకుండా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే శనివారం రోజు ఒకటింపావు నల్ల నువ్వులు లేదంటే నల్ల శనగలను పేదలకు దానం చేస్తే మీ ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవట. అలాగే డబ్బుకు కూడా లోటు ఉండదు అని చెబుతున్నారు. మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే శనివారం రోజు ఆవనూనెను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు శనివారం రోజు నల్లని బట్టలు లేదంటే నల్లటి చెప్పులు పేదలకు దానం చేస్తే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. శనివారం రోజు బియ్యం మొక్కజొన్నలు, గోధుమలు వంటి విధానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజున చేసేటటువంటి దానధర్మాలు మంచి ఫలితాలను అందిస్తాయని వాటి వల్ల శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడని చెబుతున్నారు.