Pumpkin: ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారో మీకు తెలుసా?
ఇంటిముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు, అలా కట్టడం వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:00 PM, Sun - 29 December 24

మాములుగా ఇల్లు, వ్యాపార స్థలాలలో గుమ్మడి కాయ కడుతూ ఉంటారు. దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో చాలా మంది ఇంటి ముందు గుమ్మడి కాయను వేలాడదీస్తారు. గుమ్మడి కాయ ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి కాలభైరవుడు రక్షగా ఉన్నట్లు విశ్వసిస్తుంటారు. ఇంటికి దిష్టి మొదలు, ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా గుమ్మడికాయ దూరం చేస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అలాగే ఇంటిపై ఉండే నర ఘోష, నరదృష్టి వంటి అనే దోషాల నుంచి గుమ్మడికాయ రక్షిస్తుందని హిందువులు చెబుతున్నారు. ఇంటి ముందు గుమ్మడి కాయ వేలాడదీయడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందట. ఇంటి ముందు వేలాడదీసే గుమ్మడికాయ పాడవ్వకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
ఒకవేళ ఇంటి ముందు కట్టిన గుమ్మడి కాయ త్వరగా కుళ్లిపోతే ఆ ఇంటి పై నరదృష్టి ఎక్కువగా ఉందని నమ్ముతారు. అయితే ఇంటి ముందు గుమ్మడి కాయను వేలాడదీసే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది గుమ్మడి కాయను ఇంటి ముందు వేలాడే దీసే ముందు కడుగుతుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. చాలా మంది గుమ్మడికాయను నీటితో కడిగి దానికి కుంకుమ పపుపు వంటివి పెడుతుంటారు. అయితే ఇలా కడగడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. గుమ్మడికాయను కడగడం వల్ల దానికి ఉండే పాజిటివ్ ఎనర్జీ పోతుందట. అందుకే గుమ్మడి కాయకు నేరుగా కుంకుమ, పసుపు పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలని సూచిస్తున్నారు.
అలాగే గుమ్మడి కాయ కట్టే విధానంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. గుమ్మడికాయ తొటిమ లేకుండా కడితే ఎలాంటి ప్రయోజనం ఉండదట. ఇలాంటి గుమ్మడికాయ కట్టినా కూడా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. దీనివల్ల దానికి ఉండే శక్తులు అన్నీ పోతాయట.. అందుకే గుమ్మడికాయ కట్టడం వల్ల లాభాలు ఉండాలంటే కచ్చితంగా దానికి తోడిమ ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. గుమ్మడికాయను తొడిమ కిందికి ఉండేలా కడితే కూడా ప్రయోజనం ఉండదని అంటున్నారు. దీనివల్ల గుమ్మడి కాయ నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి పోతుతుందట.
బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టే విషయంలో రోజు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమావస్య రోజు సూర్యోదయానికి ముందే గుమ్మడి కాయను కడితే మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో గుమ్మడి కాయను కడితే కనుదిష్టి, నరదిష్టి పోతుందట. ఒకవేళ అమవాస్య రోజునే వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం గుమ్మడికాయను కట్టడం మంచిదని చెబుతున్నారు. అయితే రాత్రుళ్లు కడితేనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇక గుమ్మడి కాయను కట్టే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ముందుగా బూడిద గుమ్మడికాయను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానికి పసుపును రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత గుమ్మడి కాయకు స్విస్తిక్, ఓమ్ సింబల్స్ ను కుంకుమతో రాయాలి. అనంతరం గుమ్మడికాయను జాలిలో కట్టి ఇంటి ముందు వేలాడా దీయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.