Goddess Lakshmi : ఇలాంటి వారి దగ్గర డబ్బు ఎందుకు నిలవదో తెలుసా.?
లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే మనం మంచి పద్దతులను పాటించడమే కాకుండా మనం కూడా పద్దతిగా ఉండాలి.
- By hashtagu Published Date - 06:40 AM, Fri - 2 September 22

లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే మనం మంచి పద్దతులను పాటించడమే కాకుండా మనం కూడా పద్దతిగా ఉండాలి. అందరి ఇంట్లో డబ్బు నిలవదు. కొందరు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
అస్తమాను నిద్రపోకూడదు:
లక్ష్మి దేవి ఇంట్లో నిలవాలంటే అస్తమాను నిద్రపోకూడదు. ముఖ్యంగా సంధ్యాసమయాల్లో నిద్రపోకూడదు. రాత్రి మాత్రమే నిద్రపోవాలి. సాయంత్రం పూట నిద్రపోయారంటే ధనలక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. లక్ష్మి దేవి ఇంట్లో ఉండాలంటే అస్తమాను నిద్రపోకూడదు.
కోపంగా వుండకూడదు:
కోపంగా ఉండడం ధనలక్ష్మీకి ఇష్టం ఉండదు. ఎప్పుడు గొడవలు జరిగి ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. చెడు మాట్లాడినా కఠినమైన మాటలు మాట్లాడినా ధనలక్ష్మి వెళ్లిపోతుంది.
అతిగా తినడం కోసం ఖర్చు చెయ్యకూడదు:
అతిగా తినడం కోసం ఖర్చు చెయ్యకూడదు. ఎప్పుడూ తినడమే అనే ద్యాస ఉండకూడదు. ఆకలి వేసిన దాని కంటే ఎక్కువ తినకూడదు. అలానే అతిగా తినడం కోసం ఖర్చు చెయ్యకూడదు కూడ. ఇలా చేసిన కూడ ధనలక్ష్మి ఇంట్లో నిలవదు.
ఇంటికి వచ్చిన వాళ్ళను అగౌరవపరచద్దు:
ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళను గౌరవించాలి. అతిథి దేవో భవ అంటారు. కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళను అగౌరవపరచద్దు. అలా చేస్తే లక్ష్మి దేవికి కోపం వస్తుంది.