Aghora Vs Naga Sadhu:అఘోరాలకు, నాగ సాధువులకు ఉన్న తేడాల గురించి మీకు తెలుసా?
అఘోరాలకు అలాగే నాగ సాధువులకు మధ్య ఉన్న తేడాల గురించి వారు ఎలా నివసిస్తారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:34 AM, Thu - 23 January 25

మామూలుగా అఘోరాలను నాగ సాధువులను మనం ఏదైనా ప్రత్యేక సందర్భాలలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అఘోరాలు మనకు తరచుగా కనిపించినప్పటికీ నాగ సాధువులు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మీరు జనావాసంలోకి మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలోకి చాలా తక్కువగా వస్తూ ఉంటారు. ఇంతకీ నాకు సాధువులు అంటే ఎవరు? అఘోరాలు అంటే ఎవరు? వీరిద్దరూ వేరు వేరు నా ఒకటేనా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరాలు వేరు, నాగ సాధువులు వేరు. నాగ సాధువులు పూర్తి శాకాహారులు. వీరు నేల పైనే నిద్రిస్తుంటారు. రోజులో ఒక సారి మాత్రమే భుజించాలనే నియమం ఉంది. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహరాన్నివారే సంపాదించుకుంటారు.
అది కూడా రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన అది మహా ప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఎవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిందే. అంతేకాదు నాగ సాధువులు దిగంబరంగానే జీవిస్తుంటారట. వీరు నాగ సాధువుగా శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారట. శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూది, రుద్రాక్షలు మాత్రమే వీరి ఆభరణాలు అని చెబుతున్నారు. నాగ సాధువులు ప్రధానంగా ఐదుగురు ప్రధాన దేవతలను మాత్రమే పూజిస్తారు. మొదటిగా శివుని,శక్తి అమ్మవారిని, వినాయకుని, విష్ణువు,సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు. అయితే నాగ సాధువులుగా వచ్చిన వారికి అంచలంచలుగా శిక్షణ ఇస్తారట. మొదట వారు అవధూతలుగా మారి, ఆ తర్వాత గుండు చేయించుకొని వారి ఖర్మకాండలను వాళ్లే నిర్వహించుకోవాలట.
పిండం ప్రధానం చేసుకున్న తరువాతనే వారికి నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుందట. అలాగే శిక్షణ కాలం పెరిగే కొద్దీ వారి హోదా కూడా పెరుగుతుందని చెబుతున్నారు. మొదట నాగ సాధువుగా, రెండవ హోదా మహాంతగా, మూడో హోదా శ్రీ మహాంతగా, నాలుగవ హోదా జయతిమా మహాంతగా, ఐదవ హోదా పీట మహాంతగా, ఆరవ హోదా దిగంబర శ్రీగా, ఏడవ హోదా మహా మండలేశ్వరుడిగా, ఇక చివరిగా ఎనిమిదవ హోదా ఆశ్చర్యమండలేశ్వరుడిగా పదవులు లభిస్తాయట.. చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు. వీరు హిందు పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటనికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారీనా వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుందట.
వీరు ఎంతకాలమైన నిద్ర, ఆహారాలను లేకుండా జీవించగలరట. వీరు మనుష్యలకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటారట. కేవలం కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలల సంచరిస్తుంటారు. ధర్మ పరిరక్షణ గాడి తప్పిన రోజున కాల రుద్రులుగా మారుతుంటారు. శిక్షణలో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వార లో చూడవచ్చని చెబుతున్నారు. ఇక అఘోరాల విషయానికొస్తే అఘోరాలు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాసిక్ ఉజ్జయిని, హరిద్వార్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం అఘోరాలను చూడవచ్చు.