Tulsi Plant: తులసితో ఈ పరిహారాలు చేస్తే చాలు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు!
తులసి మొక్కతో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Thu - 26 September 24

హిందూ మతంలో తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అలాగే ప్రతిరోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు. కాగా తులసి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలాగే ఇందులో ఎన్నో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. తులసి మొక్క వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఈ తులసి మొక్క మనకు దర్శనమిస్తూ ఉంటుంది. తులసి మొక్కలు విష్ణువు అలాగే లక్ష్మీదేవి ఎదురు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం.
అలాంటి తులసి మొక్కతో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. తులసి మంజరిని తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టాలి. దీన్ని మీరు డబ్బును ఉంచే ప్లేస్ లో పెట్టాలి. ఈ విధంగా చేస్తే మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ తులసి మంజరిని మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ పూజలో తులసి మంజరిని సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. అలాగే తులసీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు. సంపద కూడా పెరుగుతుందట.
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో మంజరిని కలిపిన నీటిని మీ ఇంటి మూలాల్లో చల్లాలి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుందట. అలాగే ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు. మీ వివాహంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే తులసి మంజరిని పాలలో కలిపి శివలింగానికి సమర్పించాలి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలోని అన్ని అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయట. అంతేకాదు పెళ్లికాని వారికి పెళ్లి తొందరగా కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి తులసి మొక్కతో ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.