HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do These Things The Rahu Ketu Dosha Will Be Eliminated

Rahu-Ketu: ‎రాహువు, కేతువు దోషాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే!

‎Rahu-Ketu: ‎రాహు, కేతువు దోషాలతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే ఆ దోషాలు ఖాతం అయినట్లే అని చెబుతున్నారు పండితులు. మరి రాహు కేతువు దోషాలను ఎలా నివారించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 15-12-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahu Ketu
Rahu Ketu

Rahu-Ketu: ‎‎మామూలుగా చాలామంది రాహు కేతువు దోషాలతో బాధపడుతున్నాం అని అంటుంటారు. రాహు కేతువు దోషాల వల్ల అనేక సమస్యలు వస్తాయని, జీవితంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతుంటారు. అయితే ఇలా రాహు,కేతు దోశలతో బాధపడేవారు నవగ్రహాలకు అలాగే రాహుకేతువులకు పూజ చేయిస్తూ ఉంటారు. వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే తప్పకుండా ఆ దోషాల నుంచి బయటపడవచ్చట. కాగా ఇంతకీ మొదట రాహు కేతు దోషం అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే.. రాహువు కేతువు ఛాయా గ్రహాలు. ఇవి నవగ్రహాలలో ముఖ్యమైనవి. ఒకరి జాతకంలో ఈ గ్రహాలు సరిగా లేని స్థానాల్లో ఉంటే, దానిని రాహు కేతు దోషం అంటారు.
‎
‎ఈ దోషం వల్ల జీవితంలో అనేక అడ్డంకులు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, సంబంధాలలో గొడవలు వంటివి రావచ్చని నమ్మకం. కొన్ని నియమాలతో ఉపశమనం పొందవచ్చట. రాహు కేతు దోషాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, రోజువారీ ధ్యానం, యోగా లేదా ప్రార్థన చేయాలట..ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, స్పష్టతను పొందడానికి సహాయపడుతుందట. మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుందని, రాహు కేతువుల దుష్ప్రభావాలను తగ్గించడానికి మంత్రాలు జపించడం ఒక ప్రభావవంతమైన మార్గం అని చెబుతున్నారు. “ఓం భ్రాం భ్రీం భ్రౌం సః రాహవే నమః” లేదా “ఓం కేతవే నమః ” వంటి మంత్రాలను జపించడం ద్వారా రాహు, కేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని చెబుతున్నారు.
‎
‎అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయట. ఇది పితృ దోషాలను కూడా తగ్గిస్తుందని, పితృ దోషాలు కూడా రాహు కేతు దోషాలతో ముడిపడి ఉంటాయని నమ్మకం. ఈ రోజున పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, అన్నం, నువ్వులు, బెల్లం, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం శుభప్రదం అని చెబుతున్నారు. రాహువు, కేతువులను శాంతింపజేయడానికి శివుడు, హనుమంతుడు, లేదా ఇతర ఇష్ట దైవాలను పూజించాలట. శివసహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా వంటి వాటిని పఠించడం వల్ల రాహు కేతువుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని చెబుతున్నారు. రాహు కేతు దోష నివారణకు అమావాస్య రోజున దానధర్మాలు చేయడం మంచిదట. పేదలకు, అవసరమైనవారికి సహాయం చేయడం వల్ల కూడా దోషాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు పండితులు. రాహు కేతు పూజ చేయడానికి సరైన సమయం, ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా ముఖ్యం అని చెబుతున్నారు. రాహు కేతు దోష నివారణకు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో రాహు కేతు పూజ చేయడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dosham
  • kethuvu
  • Rahu-Ketu
  • rahuvu

Related News

    Latest News

    • Leo to Meet PM Modi in Delhi Today : నేడు ప్రధానితో మెస్సీ భేటీ

    • ‎Health Tips: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

    • ‎Hair Loss: ఇది విన్నారా.. ఈ ఆహార పదార్థాలు తింటే బట్టతల గ్యారెంటీ అంటా.. జాగ్రత్త!

    • ‎Winter: చలికాలంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఇలాంటి పనులు అస్సలు చేయకండి… చేసారో?

    • ‎Cucumber: చలికాలంలో కీర దోసకాయ తినాలంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    Trending News

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd