Sunday: సంపద అదృష్టం పెరగాలంటే ఆదివారం ఈ పనులు చేయాల్సిందే!
సంపద, అదృష్టం పెరగడం కోసం ఆదివారం రోజు కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:22 PM, Wed - 9 October 24

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారంలో ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్య భగవానుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సూర్యుడు జాతకంలో శక్తివంతమైన స్థానంలో ఉంటే జీవితంలో కీర్తి సంపద ఆనందం లభిస్తాయి అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా సూర్యుడు శక్తివంతమైన స్థానంలో ఉంటే అనుకున్న పనులు కూడా అనుకున్నట్టుగా జరుగుతాయట. అయితే ఆ సూర్యభగవానుడు అనుగ్రహం కలగాలంటే ఆదివారం రోజు కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆదివారం రోజు మీ అదృష్టం పెరగడం కోసం ఎరుపు రంగు దుస్తులను ధరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివారం నాడు మీరు ఏ పనిమీదైన బయటకు వెళుతుంటే నుదిటికి ఖచ్చితంగా గంధపు తిలకాన్ని పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇది మీ పనిలో విజయాన్ని పొందడానికి సహాయపడుతుందట. ఆదివారం నాడు అవసరమైన వారికి మీరు బియ్యం, పాలు, బెల్లం, బట్టలను దానం చేయవచ్చట. వీటిని దానం చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు మీరు చేపట్టిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయట. తప్పకుండా విజయం సాధిస్తారని చెబుతున్నారు.
అలాగే మీ సంపద పెరుగుతుంది. ఇంట్లో ఆనందం వెళ్లి విరుస్తుందని చెబుతున్నారు. ఆదివారం రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం ను సమర్పించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే మీరు అర్ఘ్యం చేసేటప్పుడు ఓం సూర్యాయ నమ:, ఓం వాసుదేవాయ నమ: ఓం ఆదిత్య నమం: అనే మంత్రాలను పఠించాలని చెబుతున్నారు. ఆదివారం రోజున కొన్ని మంత్రాలను పఠిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. గాయత్రి మంత్రాన్ని పఠిస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా పొందుతారని చెబుతున్నారు. ఆదివారం ఈ మంత్రాన్ని పఠిస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుటుందట. మీ ఆనందం రెట్టింపు అవుతుందని, అలాగే చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారని చెబుతున్నారు.