Monday: సోమవారం రోజు పరిహారాలు పాటిస్తే చాలు మేము బాధలు అన్ని తొలగిపోవడం ఖాయం!
సోమవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా కొన్ని బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:45 AM, Mon - 14 October 24

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నారు పరమేశ్వరుడు. శివుడిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇకపోతే సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ రోజున శివుడితో పాటుగా పార్వతీ దేవిని పూజిస్తారు.
అలాగే ఉపవాసం ఉంటారు. వీరిని నిష్టగా పూజిస్తే జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. శివుడు తన అనుగ్రహంతో భక్తులను రక్షిస్తాడని నమ్మకం. మహాదేవున్ని ఆరాధిస్తే వారి జీవితంలో అన్ని రకాల సుఖసంతోషాలను పొందుతారని శివ పురాణంలో ఉంది. అయితే పరమేశ్వరుడిని పూజించడం మంచిదే కానీ సోమవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు. మరి సోమవారం రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికొస్తే.. ఎప్పుడు కుటుంబంలో కొట్లాటలు గొడవలు కలహాలు జరుగుతూ ఉంటే సోమవారం రోజు ఉదయం స్నానం చేసి ధ్యానం చేయాలట.
అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరున్ని పూజించాలని చెబుతున్నారు. తర్వాత మీ దగ్గరలో ఉన్న రోజ్ వుడ్ చెట్టు దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరిస్తూ, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవాలట. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయనీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. మీ జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటే సోమవారం రోజు శివుడితో పాటు సరస్వతీ దేవిని కూడా పూజించాలట. దీనివల్ల మీ మెమోరీ పవర్ పెరుగుతుందట. ఈ సమయంలో సరస్వతీదేవికి పాలు, బియ్యంతో చేసిన ఖీర్ సమర్పించాలనీ చెబుతున్నారు. అయితే సరస్వతీ మాతకు కుంకుమపువ్వు కలిగిన ఖీర్ ను కూడా సమర్పించవచ్చట. అలాగే స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం సరస్వతీ నమః అనే మంత్రాన్ని జపించాలనీ చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందట. పెళ్లికానికి వారు సోమవారం రోజు స్నానం చేసి ధ్యానం చేసి తెల్లని దుస్తులు ధరించి, తర్వాత నీళ్లలో పాలు పోసి శివునికి అభిషేకం చేయాలట. రాహు కేతువుతో సహా అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించడానికి మీరు నల్ల నువ్వులను నీటిలో కలపవచ్చట. దేవుడికోసం తెచ్చిన తెల్లని బట్టలను దేవుడికి సమర్పించాలట. శివుని ప్రసన్నం చేసుకోవడానికి భాంగ్, ధతుర, మదార పూలు మొదలైన వాటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయనీ చెబుతున్నారు.