Shanidev Remedies: శనిదేవుని కోపం తగ్గించాలి అంటే శనివారం ఇలా చేయాల్సిందే?
సాధారణంగా శని దేవుడిని న్యాయ దేవుడు కర్మదాత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడు మనం చేసే
- By Nakshatra Published Date - 06:30 AM, Mon - 31 October 22
సాధారణంగా శని దేవుడిని న్యాయ దేవుడు కర్మదాత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడు మనం చేసే పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. చెడు పనులు చేసే వారికి అస్త కష్టాలను పెడుతూ ఉంటారు. మంచి పనులు చేసే వారికి శని దేవుని అనుగ్రహం లభించడంతో పాటు వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శని దేవుని యొక్క వక్ర దృష్టి ఎవరిపై అయితే పడుతుందో ఆ వ్యక్తి జీవితం సర్వ నాశనం అవుతుంది. అలాగే శని దేవుని అనుగ్రహం ఎవరిపై అయితే ఉంటుందో ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు.
అయితే శని దేవుని కటాక్షం పొందడానికి అలాగే శని దేవుని కోపాన్ని తగ్గించడానికి కొన్ని రకాల పరిహారాలను పాటించాలి. మరి ఎటువంటి పరిహారాలను పాటిస్తే శని దేవుని కోపం తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనివారం రోజు నల్ల ఉల్లి తో పరిహారంతో చేస్తే శనిదేవుడి ప్రసన్నడు అవుతాడు. శనివారం రోజున శని దేవునికి నల్ల ఉల్లి ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి జాతకంలో శని దోషం ఉంటే అది కూడా తొలగిపోతుంది. అదేవిధంగా శనివారం రోజు రావి చెట్టుకి నీరు పోయాలి.
ఈ విధంగా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజున రెండు నెలల ఉల్లిపాయలను తీసుకొని వాటికి పెరుగు పచ్చిమిర్చి రాయాలి. ఆ తర్వాత దానిని పీపాల్ చెట్టు కింద పెట్టాలి. ఆ విధంగా 21 రోజులు చేయడం వల్ల ఆ మనిషికి ఉన్న సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి. అదేవిధంగా శనివారం రోజున నల్ల వస్తువులను దానం చేయాలి. అనగా నల్ల పప్పు నల్ల బట్టలు నల్ల నువ్వులు లేదా నల్ల శనగపప్పును పేదవారికి ఎంతో మంచిది. శనివారం రోజున ఆ వస్తువులను దానం చేయడం వల్ల ఆ వ్యక్తి పై సడే సతి ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది.
Related News
Shanidev: శనీశ్వరుడి అనుగ్రహం కలగాలనుకుంటున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే?
మామూలుగా చాలామంది శనీశ్వరుడి పేరు వింటే చాలు భయపడిపోతూ ఉంటారు. శనిదేవుడిని పూజించాలన్నా, ఆయన గుడికి వెళ్ళాలి అన్నా కూడా భయపడు