Idols: పొరపాటున కూడా ఇంట్లో ఆ దేవుళ్ళ విగ్రహాలు అస్సలు పెట్టుకోకండి.. పెట్టుకుంటే కష్టాలు మీ వెంటే?
మామూలుగా హిందువులు ఇంట్లో నిత్యజీవారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పూజ గదిలో అలాగే ఇంట్లో అనేక రకాల దేవుళ్ళ ఫోటోలు దేవుళ్ళ విగ్రహాలు పెట్టుక
- By Anshu Published Date - 11:00 AM, Thu - 1 February 24

మామూలుగా హిందువులు ఇంట్లో నిత్యజీవారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పూజ గదిలో అలాగే ఇంట్లో అనేక రకాల దేవుళ్ళ ఫోటోలు దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే తప్పనిసరిగా రోజు వాటికి పూజలు చేయాలని చెబుతూ ఉంటారు. క్రమం తప్పకుండా పూజ చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విస్తరిస్తుంది. అయితే దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకోవడం మంచిదే కానీ కొందరు దేవుళ్ళ విగ్రహాలను, తెలిసి తెలియకుండా పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అంటున్నారు పండితులు. మరి ఎటువంటి దేవుళ్ళ విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదో ప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంట్లో దేవత విగ్రహాలను పెట్టుకోవాలి అనుకునేవారు రాహు కేతువుల విగ్రహాలను ఎప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంట్లో రాహు కేతువుల విగ్రహాలు, చిత్ర పటాలు పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. ఆ కుటుంబ సభ్యులు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో మహంకాళి విగ్రహాన్ని పొరపాటున కూడా పెట్టుకోకూడదు. తల్లి దుర్గా పార్వతీ దేవి మరొక రూపంగా మహంకాళిని భావిస్తారు. కాబట్టి మహంకాళి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. అలాగే ఇంట్లో నరసింహ స్వామి విగ్రహాన్ని ఎప్పుడూ పెట్టుకోకూడదు.
దుష్టుడైన హిరణ్యకశిపుడిని చంపడానికి విష్ణువు నరసింహస్వామిగా భూమిపై అవతరించాడు. విష్ణువు ఉగ్రరూపం అయిన నరసింహ స్వామి అవతారాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. అందుకే పొరపాటున కూడా నరసింహ స్వామి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెబుతుంటారు. ఇక ఇంట్లో పెట్టుకో కూడని మరొక విగ్రహం శని దేవుడి విగ్రహం. శని దేవుడు విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లోకి తీసుకు రాకూడదు. కాబట్టి పైన చెప్పిన దేవుళ్ళ విగ్రహాలను పొరపాటున కూడా మీ ఇంటికి అస్సలు తెచ్చుకోకండి.