Ayyappa Mala: అయ్యప్ప మాలలో ఉన్నవారు పాటించాల్సిన నియమాల గురించి మీకు తెలుసా?
అయ్యప్ప మాల ధరించిన వారు తప్పకుండా కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:03 PM, Sat - 21 December 24

మామూలుగా నవంబర్ లేదా డిసెంబర్ సమయం నుంచి జనవరి ఫిబ్రవరి సమయం వరకు అయ్యప్ప మాల, శివమాల వెంకటేశ్వర మాల, భవాని మాల అంటూ రకరకాల దేవుళ్లకు సంబంధించిన మాలలు ధరిస్తూ ఉంటారు. కార్తీక మాసం మొదలుకొని శివరాత్రి వరకు ఈ మాలలు ధరిస్తూ ఉంటారు. ఈ మాలలు ధరించిన సమయంలో చాలా నిష్టగా ఉండాలి. ఎన్నో రకాల నియమ నియమాలను కూడా పాటించాలి. ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయడంతో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి.
మాంసాహారం వంటివి అసలు ముట్టకూడదు. పొగ తాగటం మద్యం సేవించడం లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. వీటితో పాటుగా ఇంకా కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఇతరులను అయ్యప్ప స్వామి అని పిలవాలి. మహిళలను మాత అని పిలవాలి. పరుపులు మంచాలపై కాకుండా కటిక నేలపై నిద్రించాలి. అలాగే ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారం తీసుకోవాలి.
బహిష్టు అయిన మహిళలను చూడకూడదు. ఒకవేళ పొరపాటున చూసిన తగిలిన తల స్నానం చేసి శరణు ఘోష చెప్పినంత వరకు మంచి నీళ్లు అయినా ముట్టుకోరాదు. స్వామికి శరణు ఘోష అంటే ఎంతో ప్రీతి. కాబట్టి నిరంతరం అయ్యప్ప భజనలో పాల్గొనాలి. అంతేకాకుండా కటోర నిష్టతో అస్కలిత బ్రహ్మచర్యం పాటించి అష్ట రాగాలు పంచేంద్రియాలు త్రిగుణాలు, విద్య అవిద్య అనబడే 18 గుణాలకు దూరంగా ఉండాలి. మాల వేసుకున్నప్పటి నుంచి మాల తీసివేసే వరకు చాలా రకాల నియమాలను పాటించాలి.