Sunday: ఆదివారం తులసి మొక్క వద్ద దీపం పెట్టవచ్చా, పెట్టకూడదా?
ఆదివారం తులసి ముఖకు పూజ చేయవచ్చా చేయకూడదా అన్న అంశాల గురించి తెలిపారు.
- By Nakshatra Published Date - 02:00 PM, Mon - 2 September 24
హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే దాదాపు హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు. కాబట్టి తులసి మొక్కను పూజిస్తే అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అయితే తులసి మొక్కను పూజించడం మంచిదే కానీ కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని రకాల పనులు చేయడం నిషేధం. మరి తులసి మొక్క విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అలాగే తులసి మొక్కకు కొన్ని సందర్భాల్లో, రోజుల్లో నీరు పోయకూడదని చెప్తారు. ఆదివారం తులసికి నీరు సమర్పించడం నిషిద్ధం. అయితే ఆదివారం నాడు తులసిమొక్క దగ్గర దీపం వెలిగించకూడదా? అనే ప్రశ్న కూడా చాలామందికి వచ్చే ఉంటుంది. మరి ఈ విషయంపై పండితులు ఏమంటున్నారు అన్న విషయానికి వస్తే.. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసి పూజించాలని నమ్ముతారు. ఇలా చేస్తే ఇంటి సౌభాగ్యం కొనసాగుతుందట. అయితే కొన్ని గ్రంధాల్లో అయితే ఈ రోజు తులసికి నీరు సమర్పించడం నిషిద్దమట. తులసి మాత ఆదివారం విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున తులసి మాతకు నీటిని సమర్పించకూడదని నమ్ముతారు. ఈ రోజు నీటిని సమర్పిస్తే ఆమె ఉపవాసం విరమించబడుతుంది. దాంతో తులసీదేవి ఉపవాస అని మనం చెడగొట్టినట్టు అవుతుంది.
అలాగే మీరు పూజ చేసిన ఫలితాన్ని కూడా పొందలేరు. అలాగే ఈ రోజున తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం కూడా నిషిద్ధమని, ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు. ఆదివారం తులసి మొక్కను ముట్టుకోకూడదని కూడా అంటారు. తులసి మొక్క దగ్గర సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించకూడదని నమ్ముతారు. తులసి మొక్క సూర్యాస్తమయం తరువాత నిద్రలోకి జారుకుంటుందని ఈ సమయంలో వారి ఆరాధన ఆమోదయోగ్యం కాదని నమ్ముతారు.
ఈ సమయంలో తులసికి నీటిని కూడా సమర్పించకూడదని, ఆదివారాల్లో కూడా తులసి దగ్గర దీపాలు వెలిగించకూడదట. నిజానికి ఆదివారాన్ని సూర్యభగవానుని రోజుగా భావిస్తారు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. అదేవిధంగా సూర్యుడు, విష్ణువును కలిసి పూజించకూడదని చెప్తారు. అందుకే ఈ రోజున తులసిని పూజించడం లేదా తులసి దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం. అలా కాకుండా గ్రహణ సమయంలో తులసిలో దీపం వెలిగించకపోవడమే మంచిది. కాబట్టి ఆదివారం రోజు తులసి మొక్కకు పూజ చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.
Tags
Related News
Spirituality: దేవుడు ఫోటోకి పెట్టిన పువ్వులు కింద పడితే దాని అర్థం ఏంటో తెలుసా?
దేవుడు ఫోటోకి పెట్టిన పువ్వులు కింద పడితే దానిని శుభసంకేతంగా భావించాలని చెబుతున్నారు.