Varalakshmi Vratham: పెళ్లి కానీ ఆడపిల్లలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
పెళ్లి కానీ ఆడపిల్లలు వరలక్ష్మీ వ్రతం చేయాలి అనుకున్న వారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలట.
- By Anshu Published Date - 01:35 PM, Wed - 14 August 24

పెళ్లి కానీ ఆడవారికి పెళ్లి అయిన ఆడవారికి కాస్త వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చేసే విషయంలో ధరించే ఆభరణాల విషయంలో అలాగే పూజల విషయంలో కొన్ని రకాల తేడాలు గమనించవచ్చు. పెళ్లి అయిన స్త్రీలు చేసే కొన్ని రకాల పూజలు పెళ్లి కానీ ఆడవారు చేయకూడదని చెబుతూ ఉంటారు. అయితే పెళ్లి అయిన స్త్రీలు చేసే వాటిలో వరలక్ష్మీ వ్రతం కూడా ఒకటి. శ్రావణమాసంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్లి కానీ ఆడపిల్లలు జరుపుకోవచ్చా? ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల సరస్వతీ దేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ వ్రతాన్ని కేవలం వివాహం చేసుకున్న మహిళలు మాత్రమే చేయాలని పండితులు సూచిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని కేవలం పెళ్లయిన మహిళలు మాత్రమే వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని కన్యలుగా ఉండే అమ్మాయిలు చేయడాన్ని నిషేధించారు. ఎందుకంటే వివాహితులు తమ కుటుంబం ఆనందం, సంతోషం, శాంతి, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ పర్విదినాన వారి కుటుంబంలోని అత్త, భర్త ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేయడం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆదర్శంతమైన మహిళా జీవితాన్ని గడుపుతారు.
పెళ్లి కాని మహిళలకు అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మీకు మెట్టినింటితో ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే కన్యలుగా ఉండే అమ్మాయిలు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించకూడదని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నప్పుడు మెడలో తప్పనిసరిగా మంగళసూత్రం ఉండాలని అలా నిండు ముత్తైదువుగా వరలక్ష్మి దేవికి పూజ చేస్తే సుమంగళిగా జీవిస్తారని పండితులు సైతం చెబుతున్నారు.