HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Can Pregnant Women Perform Pooja

Pregnant Women Pooja : గర్భవతులు పూజలు, వ్రతాలు ఎందుకు చేయకూడదు..!!

మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేందుకు ఇష్టపడుతుంటారు. శ్రావణమాసం, కార్తీక మాసాల్లో అయితే తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు

  • Author : hashtagu Date : 13-07-2022 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pregnant women
pregnant women

మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేందుకు ఇష్టపడుతుంటారు. శ్రావణమాసం, కార్తీక మాసాల్లో అయితే తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు. మరి స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా. అలా చేస్తే వారిపై వాస్తు ప్రభావం పడుతుందా అనే సందేహాలు ప్రతివారిలో వస్తుంటాయి.

వాస్తు ప్రభావం
గర్భవతిగా ఉన్న స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమెపైనా..ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే మూడు నెలలకు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటప్పుడు పూర్తిగా చేయకపోయినా…కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం చేత ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇంటికి మార్పులు, చేర్పులు కానీ, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు.

పూజలు, వ్రతాలు
స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంభించాలనీ కొబ్బరికాయను మాత్రం కొట్టరాదు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ పుణ్యక్షేత్రాల దర్శనం కూడా చేయరాదు.

కోటిసార్లు పూజచేయడం కంటే..ఒక స్తోత్రం చదవడం, కోటీ స్తోత్రాలు చదవడం కన్నా ఒకసారి జపం చేయడం…కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. అందుకే గర్భవతులు ధ్యానం చేయడం అన్నివిధాల మంచిదని సూచిస్తోంది. గర్భవతులకు పూజల విషయంలోఈ నియమం విధించడం వెనక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.

ఇక ఐదు నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని…ఆ తర్వాత చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజలు, వ్రతాల పేరుతో వాళ్లు ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈనియమం చేసినట్లు పండితులు చెబుతున్నారు. పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలపై వుంటాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ నియమాన్ని విధించినట్లు శాస్త్రం చెబుతోంది.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • god
  • pooja
  • pregnant
  • temple
  • women

Related News

Navagraapooja

Navagraha : గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసా ?

నవగ్రహ ప్రదక్షిణలు పూర్తయిన వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళిపోకూడదు. ప్రదక్షిణలు ముగిసిన తర్వాత మరోసారి ప్రధాన దైవాన్ని (మూలవిరాట్టును) దూరం నుండి అయినా దర్శించుకుని, కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి.

  • Investment Women

    Investment : ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ‘మహిళా’ విప్లవం!

Latest News

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

  • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd