Black Thread: పెళ్ళైన స్త్రీలు కాలికి నల్లదారం కట్టుకోకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
పెళ్లయిన ఆ స్త్రీలు కాలికి నల్ల దారం కట్టుకుంటే అలాంటి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 05:00 PM, Thu - 1 August 24

మామూలుగా స్త్రీ పురుషులు పెళ్లి అయిన వారు అలాగే పెళ్లి కాని వారు కాలికి నల్ల దారం కట్టుకుంటూ ఉంటారు. పురుషులు కుడి కాలుకు నల్ల ధారం కట్టుకుంటే, స్త్రీలు ఎడమ కాలికి నల్లదానం కట్టుకుంటూ ఉంటారు. ఇలా కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా జ్యోతిష్యశాస్త్రంలో నల్ల దారాన్ని ఎంతో ముఖ్యమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు. నల్లదారం మనల్ని చెడు కంటి నుంచి రక్షిస్తుంది. అలాగే ప్రతికూల శక్తులకు దూరంగా ఉంచడానికి వీటిని కట్టుకోవాలని జ్యోతిష్యులు కూడా చెబుతుంటారు.
ముఖ్యంగా చిన్న పిల్లలకు నల్లదారాన్ని ఖచ్చితంగా కడతారు. అయితే కొంతమంది నల్ల దారాన్ని ధరించకూడదని లేదా నల్ల తాడు వారికి అశుభంగా భావిస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దీనివల్లే పెళ్లైన ఆడవారు నల్లదారాన్ని కట్టుకోవాలా? లేదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఎందుకంటే వివాహిత మహిళలకు నలుపు రంగు నిషిద్ధం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వివాహిత మహిళలు నల్ల తాడును కట్టుకోవాలా? వద్దా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లైన ఆడవాళ్లకు నలుపు అంత మంచిది కాదట..జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వివాహిత మహిళలకు నలుపు రంగు అశుభంగా పరిగణించబడుతుంది.
కాబట్టి వివాహిత మహిళలు నలుపు రంగు దుస్తులను ధరించకుండా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నిజానికి నలుపు రంగు శనిగ్రహానికి ఇష్టమైన రంగుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో నల్ల దారాన్ని కట్టుకుంటే శనిదేవుని ఆశీస్సులు అలాగే ఉంటాయి. అంతే కాకుండా రాహు, కేతువుల ప్రభావం కూడా మీపై ఉండదట. అందుకే కొంతమంది జ్యోతిష్యులు వివాహిత స్త్రీలు ఖచ్చితంగా నలుపు దారాన్ని ధరించాలని చెబుతున్నారు. దీని వల్ల వారి జాతకంలో శని దోషం తొలగిపోతుందట..కాగా దీన్ని కొన్ని నియమాలతో ధరించాలి. వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తుండటం వల్ల నలుపు దారాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి నల్లదారాన్ని కాలుకు కట్టే బదులు చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది కాకుండా వివాహిత స్త్రీలకు శని ఆరాధన నిషిద్ధం.