Good Luck: అదృష్టం కలిసి రావాలా.. అయితే క్రమం తప్పకుండా వీటిని చేయాల్సిందే?
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కచ్చితంగా వాస్తు ప్రభావం చూపుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అది
- By Nakshatra Published Date - 06:00 AM, Sat - 25 February 23
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కచ్చితంగా వాస్తు ప్రభావం చూపుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అది ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే ఆరోగ్యపరంగా కావచ్చు. వాటికి వాస్తు శాస్త్రంలో పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో చెప్పే ఆ వాస్తు విషయాలను పరిహారాలను పాటించడం వల్ల వ్యక్తి జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడంతో పాటు, ఆర్థికంగా కూడా అనేక రకాల మార్పులను గమనించవచ్చు. ఒకవేళ ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వ్యక్తి జీవితంలో గ్రహాలు బలహీనంగా ఉంటే ఎంత సంపాదించినా చేతిలో మిగలకపోగా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఉదయాన్నే స్నానం చేసే సమయంలో మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పరిహారం మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. అలాగే విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే హనుమంతుడు తన భక్తులను సమస్యల నుంచి గట్టి ఎక్కిస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందువలన పంచముఖి హనుమంతుడిని క్రమం తప్పకుండా పూజించాలి.
మంగళవారం పంచముఖి హనుమంతుడి ముందు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ నెలకొని ఉంటే రోజూ సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది. క్రమం తప్పకుండా పూజ చేసేటప్పుడు శంఖం,గంట శబ్దాలను చేయడం వల్ల వ్యక్తి ఇంట్లో మంచి జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాలం కలిసి వస్తుంది.
Related News
Governor: హనుమాన్ టీంను అభినందించిన తెలంగాణ గవర్నర్
Governor: 2024లో టాలీవుడ్ నుండి వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ హనుమాన్ 25 సెంటర్లలో 100 రోజుల థియేట్రికల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సూపర్ హీరో సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది. నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇవాళ తెలంగాణ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ను కలిసే అవకాశం లభించింది. వీరిద్దరితో గవర్నర్ కొన్ని నిమి�