Lizard: దీపావళి రోజు ఇంట్లోకి బల్లి రావడం మంచిది కాదా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
దీపావళి రోజు బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 27 October 24

దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లల మారిపోయి టపాసులు పేలుస్తూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే దీపావళి పండుగకు ఇంటిని మొత్తం అందంగా అలంకరించుకోవడంతో పాటు , ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటారు. అయితే అలా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు బల్లులు, కిటకాలు, బొద్దింకలు వంటివి క్లీన్ చేస్తుంటారు. బల్లులు మీద పడకూడదని వీటిని ఇంట్లో ఉండకుండా చేసేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. బల్లులు ఇంట్లో ఉండటం శుభప్రదం. మరి దీపావళి నాడు బల్లులను చూడటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దీపావళి పండుగ రోజు మీకు మీ ఇంట్లో బల్లి కనిపించినట్టైతే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. ఎందుకంటే బల్లిని లక్ష్మేదేవికి చిహ్నంగా కూడా భావిస్తారు. కాబట్టి దీపావళి నాడు బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టకూడదు అని చెబుతున్నారు. ఇంటి గుడిలో కూడా అప్పుడప్పుడు బల్లులు కనిపిస్తాయి. మన ఇండి గుడిలో బల్లులు కనిపించడం ఎంతో పవిత్రం. అంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే మీ ఇళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని కూడా అర్థం. కాబట్టి ఇంటి గుడిలో బల్లి కనిపిస్తే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దీపావళి రోజున మీరు లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు బల్లి కనిపించిందని ఏం జరుగుతుందోనని పెద్దగా భయపడకండి.
ఎందుకంటే ఇది లక్ష్మీదేవి నుంచి మంచి శుభ సంకేతమంటున్నారు. అందుకే పూజా సమయంలో మీకు బల్లి కనిపిస్తే సంతోషించాలట. అలాగే అమ్మవారిని మీ కోరికలను తీర్చమని ప్రార్థించాలట. కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా బల్లులు తలపై కూడా పడుతుంటాయి. ఏమౌతుందోనని చాలా మంది తెగ భయపడిపోతుంటారు. కానీ దీని వల్ల ఎలాంటి ఆపద రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. తలపై బల్లి పడటం పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున మీ తలపై బల్లి పడితే మీకు రాజయోగం కలగబోతుందని అర్థం. ఒకవేళ మీకు దీపావళి నాడు బల్లి తలమీద పడితే తలస్నానం చేసి దేవాలయానికి వెళ్లి దానం చేయాలని చెబుతున్నారు పండితులు..