Sesame Oil: దీపారాధనకు నువ్వుల నూనే మాత్రమే ఎందుకు ఉపయోగించాలో మీకు తెలుసా?
మామూలుగా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి నూనె ఉపయోగిస్తే మరి కొందరు ఆముదం మరికొందరు చమురు మరికొందరు దీపారాధనను నేను ఉపయోగిస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 07:09 PM, Mon - 8 July 24

మామూలుగా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి నూనె ఉపయోగిస్తే మరి కొందరు ఆముదం మరికొందరు చమురు మరికొందరు దీపారాధనను నేను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఒకొక్కరు ఒక్కొక్క ఆయిల్ తో పూజ చేస్తుంటారు. అయితే ఎక్కువ శాతం మంది నువ్వుల నూనెతోనే పూజలు చేస్తూ ఉంటారు. పండితులు కూడా పూజలో ఎక్కువ శాతం నువ్వుల నూనె ఉపయోగించమని చెబుతూ ఉంటారు. మరి అలా ఎందుకు చెబుతారు.
పూజలో నువ్వుల నూనెను ఎందుకు ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కోరికలు నిదానంగా తీరుతాయని, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరమని చెప్పబడింది. ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరితగతిన తీరుతాయని చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టం అని పండితులు. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు.
అలాగే శత్రు పీడ తొలగిపోవడానికి, గండాల నుండి బయటపడడానికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది అంటున్నారు పండితులు. అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల అనారోగ్య బాధలు తగ్గడానికి తెలుపు నువ్వుల నూనె దీపారాధనకు వినియోగిస్తే ఎంతో మంచిదని చెబుతున్నారు. నిత్యం తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అనేక సమస్యల నుండి తెలుపు నువ్వుల నూనె గట్టెక్కిస్తుంది అని చెప్తున్నారు. అలాగే అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ, అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిదట. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఆముదంతో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు. ఇక గంధం నూనెతో దీపారాధన చేయడం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటున్నారు.