HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Amavasya Dos And Donts To Follow On New Moon Day To Eliminate Bad Luck

Amavasya: దురదృష్టం పోవాలంటే అమావాస్య రోజు ఏం చేయాలి,ఏం చేయకూడదో మీకు తెలుసా?

అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి వివరించారు.

  • Author : Anshu Date : 08-10-2024 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amavasya
Amavasya

మామూలుగా చాలామంది పౌర్ణమి,అమావాస్య సమయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుని ప్రతికూల శక్తుల రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున తమ పూర్వీకులకు పూజ చేయాలి. దీని వల్ల ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే ఈ రోజున ఇంటిని స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుతాయి. జ్యోతిష్యశాస్త్రంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే భారతదేశంలో జన్మాష్టమి నుంచి దీపావళి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలను మనం అమావాస్య రోజునే జరుపుకుంటాం.

ఇక ఈ రోజు ప్రతికూల శక్తి పోవాలని చాలా మంది ఎన్నో పద్దతులను కూడా పాటిస్తుంటారు. ఇకపోతే మరి అమావాస్య నాడు ఎలాంటి పనులు చేయవలెను ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. అమావాస్య నాడు చీపురును కొనడం అస్సలు మంచిది కాదట. దీన్ని కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొదవ వస్తుందట. అలాగే ఇంట్లో చెడు ప్రభావం ఉంటుంది. అంతేకాదు మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. అమావాస్య నాడు తులసి లేదా మారెడు ఆకులను అస్సలు తెంపకూడదట. ఒకవేల మీరు దేవుడికి సమర్పించాలనుకుంటే అమావాస్యకు ముందు రోజే కోసి పెట్టుకోవడం మంచిది. అమావాస్య నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.

అసలు దీన్ని ముట్టుకోనేవద్దు. ఈ రోజు మందు తాగడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. అంతేకాదు కుటుంబం కూడా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అమావాస్య రోజు రావి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే అంతా మంచే జరుగుతుందట. అలాగే దేవతలను, పూర్వీకులను పూజించాలి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనడం, పెళ్లి వేడుకులను చేసుకోవడం, పూజా సామాగ్రిని కొనడం, మాంసం తినడం అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజు ఎలాంటి శుభకార్యాల్లో పాల్గొనకూడదు. అంతేకాదు వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద లావాదేవీలను చేయకూడదట. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించకూడదని చెబుతున్నారు. అలాగే అమావాస్య రోజు చనిపోయిన కుటుంబ సభ్యులను పూజించడం మంచిది.

ఇకపోతే అమావాస్య నాడు శ్మశాన వాటికలు వంటి చీకటి, నిర్మానుశ్య ప్రదేశాలకు వెళ్లకూడదట. ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తులు పనిచేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రతి అమావాస్య రోజున మన పూర్వీకులు తమ ఇండ్లకు సందర్శిస్తారట. అందుకే ఈ రోజున దానధర్మాలు చేయాలని చెబుతున్నారు. ప్రతి అమావాస్య నాడు ఆవుకు 5 రకాల పండ్లను, గోధుమ ఉండలను పెట్టాలట. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరిగి ఆదాయం స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • Amavasya
  • New Moon day
  • things

Related News

Why did FSSAI take strict action against liquor manufacturers?

Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

అదనపు ఫ్లేవర్లను అనధికారికంగా ఉపయోగించడం మరియు వయస్సుకి సంబంధించిన వాదనలను పాటించనందుకు, మద్యపాన తయారీదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆహార భద్రతా మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) గురువారం తెలిపింది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బెవరేజెస్) రెగ్యులేషన్స్, 2018’ కింద నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. అదనపు ఫ్లేవర్ల వాడకంపై నిష

  • Does drinking alcohol lead to good sleep? How true is it?

    Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd