Ram Mandir Inauguration : రామ మందిరం ప్రారంభంలో ఆ 84 సెకన్లే కీలకం..
- Author : Sudheer
Date : 22-01-2024 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో 84 సెకన్లు కీలకం కాబోతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం కేవలం 84 సెకన్ల పాటు ఉండనుంది. మధ్యాహ్నం 12:29:03 నుంచి12:30:35 గంటల వరకు మాత్రమే శుభ సమయంగా ఉంది. ఈ 84 సెకన్లలోనే ప్రాణప్రతిష్టకు సంబంధించిన కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. పండితులు దీనిని ఎంతో శుభ ముహూర్తం (Mool Muhurat)గా పేర్కొంటున్నారు. ఈ సమయాన్ని కాశీ జ్యోతిష్కుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలు, గిరిజన సంప్రదాయాలకు చెందిన 50 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ మహా కార్యక్రమం కోసం దేశం, విదేశాల నుంచి సెలబ్రిటీలు అయోధ్యకు వచ్చారు. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా లైవ్ ప్రసారం అవుతోంది. అన్ని రైల్వే స్టేషన్లలో లైవ్ ఇస్తున్నారు. అలాగే ఈ వేడుక భద్రత కోసం 13వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అలాగే 10వేల సీసీ కెమెరాలు, యాంటీ మైన్ డ్రోన్లూ ఉన్నాయి. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, NDRF, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
Read Also : Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి