Ganesh Chaturthi: 300 ఏళ్ల తర్వాత గణేష్ చతుర్థి సందర్భంగా ఆ రాశుల వారి జీవితాలు అద్భుతాలు?
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గణేష్ చతుర్థి వచ్చేసింది. ఇప్పటికే ప్రజలు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయ
- By Nakshatra Published Date - 03:25 PM, Sun - 17 September 23
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గణేష్ చతుర్థి వచ్చేసింది. ఇప్పటికే ప్రజలు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ సంగతి పక్కన పెడితే ఈసారి అనగా దాదాపు 300 సంవత్సరాల తర్వాత కొన్ని రాశుల వారికి అద్భుత యోగం పట్టబోతోంది. వినాయక చవితి పండుగ నుంచి కొన్ని రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆ రాశులు ఏవి ఎటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అన్న వివరాల్లోకి వెళితే..
గణేశ చతుర్థి భాద్రపద మాసంలో చౌతి రోజున జరుపుకోంటారు. ఈ సంవత్సరం చతుర్థి పండుగ సెప్టెంబర్ 18, 19 తేదీలలో జరుపుకొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ సంచారాల కారణంగా దాదాపు 300 ఏళ్ల తర్వాత గణేష్ చతుర్థి నాడు 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఇదే ప్రత్యేకత. ఈ సంవత్సరం శుక్లయోగం, శుభ యోగం, బ్రహ్మయోగం ఏర్పడుతున్నాయి.
దీంతో మూడు రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇందులో మొదటిది మేషరాశి… ఈ మూడు శుభ యోగాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారిలో సంతానం కోసం ఎదురుచూసేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచి సమయం. మీ ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. ఈ చతుర్థి తర్వాత మీరు ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
మరొక రాశి మిథున రాశి.. ఈ మూడు శుభ యోగాల వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగాలు వచ్చాయి. ఈ కాలంలో మీ అదృష్టం పెరుగుతుంది. చతుర్థి తర్వాత మీకు ధనయోగం కలుగుతుంది. మీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది. మీ ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది.. మూడవ రాశి మకర రాశి…మకర రాశి వారికి ఈ మూడు శుభ యోగాల వల్ల అదృష్ట మద్దతు లభిస్తుంది. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం సాగుతాయి. మీరు డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగి ప్రమోషన్ పొందుతారు. ఈ చతుర్థి తర్వాత మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు.
Related News
Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ
Ugadi 2024 : ఉగాది పండుగ ఏప్రిల్ 09న రాబోతోంది.