Vastu Shastra: ఇంట్లో మట్టి వస్తువులు ఇలా అమర్చుకుంటే చాలు.. అలాంటి సమస్యలు పరార్?
ప్రస్తుత రోజుల్లో చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మడంతో పాటు వాస్తు శాస్త్రంలో
- Author : Anshu
Date : 24-02-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మడంతో పాటు వాస్తు శాస్త్రంలో చెప్పబడిన ఎన్నో రకాల పరిహారాలు, సూచనలు,నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మనం ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఆర్థికపరంగా ఎదుర్కొనే సమస్యలకు కొన్ని కొన్ని సార్లు వాస్తు సమస్యలు కూడా కారణం కావచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల ఆర్థికంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.
అలాగే వాస్తుని అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం గా ఇంట్లో వస్తువులను అమర్చుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మట్టి పాత్రలను ఉంచడం ఎంతో మంచిది. మట్టి పాత్రలు ఇంట్లో ఉంచడం వల్ల ఇంటికి ఎంతో మంచిది. మట్టితో తయారు చేసిన కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంచితే ఆనందంగా, సంతోషంగా ఉండవచ్చు. అలాగే సమస్యలు కూడా తొలగిపోతాయి. మట్టి పాత్రలో నీళ్లు వేసుకుని ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి కలుగుతుంది.
ఎప్పుడైనా సరే నీటితో ఉండే కుండని ఇంట్లో ఉత్తరం వైపుకి పెడితే మంచిది. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలానే మట్టితో చేసిన ఆర్టి ఫ్యాక్ట్స్ ని ఈశాన్యం లేదా ఆగ్నేయం వైపు పెడితే ఆనందంగా ఉండవచ్చు. ఈ విధంగా మట్టి వస్తువులను అమర్చుకోవడం వల్ల ఆర్థిక సమస్యలను తొలగించుకోవడంతో పాటు ఆరోగ్యంగా కూడా జీవించవచ్చు.