Monalisa : 3 ఏళ్ల క్రితం మోనాలిసా ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!!
Monalisa : కుంభమేళాలోని భారీ గుంపు తాకిడిని తట్టుకోలేక ఆమె తన స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆమె అందం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది
- By Sudheer Published Date - 01:41 PM, Wed - 5 February 25

మోనాలిసా భోంస్లే (Monalisa).. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలదండలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ కెమెరా కంటికి చిక్కింది. ఆమె తేనెకళ్లు, స్వచ్ఛమైన చిరునవ్వుతో అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. కుంభమేళాలోని భారీ గుంపు తాకిడిని తట్టుకోలేక ఆమె తన స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆమె అందం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
Preity Zinta: ఈ సారి ఐపీఎల్ టైటిల్ నాదేనంటున్న ప్రీతీ పాప
ఇటీవలే, మోనాలిసాకు సంబంధించిన 3 ఏళ్ల క్రితం తీసిన ఓ పాత ఫోటో వైరల్ అవుతోంది. 2022లో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో “పరికర్మ” సినిమా షూటింగ్ సమయంలో ఆమెను చూసిన సినిమా యూనిట్, ఆమె కళ్లు మరియు ముఖ కవళికలతో మంత్రముగ్ధులయ్యారు. ఫోటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమె ఫోటోలు తీసి, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను తన తర్వాతి సినిమాలో తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. సనోజ్ మిశ్రా తీస్తున్న “ది డైరీ ఆఫ్ మణిపూర్” సినిమాలో మోనాలిసా మణిపూర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుమార్తె పాత్రను పోషించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో మోనాలిసా పాత్ర చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలనే కోరికతో ఉన్న యువతి. ఆమె ఎదుర్కొన్న కష్టాలు మరియు చివరికి సైన్యంలో చేరిన కథనం ఈ సినిమాలో చూడవచ్చు. ఈ పాత్రకు తగినట్లుగా యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి మోనాలిసా ముంబైకు వెళ్లినట్లు సమాచారం.