Yatra 2 : జగన్ బయోపిక్ యాత్ర 2 మొదలైంది.. షూటింగ్ వీడియో వైరల్.. జగన్ పాత్రలో..
గతంలో యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా(Jeeva) నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
- By News Desk Published Date - 08:28 PM, Sun - 24 September 23

ఎన్నికల సమయంలో రాజాకీయ నాయకులకు, పార్టీలకు సంబంధించిన సినిమాలు రావడం మాములే. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) బయోపిక్ (Biopic)గా వచ్చిన యాత్ర మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహి రాఘవ్(Mahi V Raghava) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడమే కాక ఎన్నికల ముందు రిలీజ్ చేయడంతో వైసీపీ(YCP)కి కూడా సపోర్ట్ అయింది.
దీంతో జగన్(Jagan) బయోపిక్ యాత్ర 2 సినిమాని కొన్ని రోజుల క్రితం యాత్ర సినిమా తీసిన మహి రాఘవ్ ప్రకటించాడు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని కూడా ప్రకటించారు. ఎన్నికల ముందు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. వైఎస్సార్ మరణించాక జగన్ పడ్డ కష్టాలు, జగన్ ఎలా సీఎం అయ్యాడు, జగన్ పాదయాత్ర.. అనేది ఈ సినిమాలో ఉండొచ్చని సమాచారం. గతంలో యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా(Jeeva) నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
యాత్ర -2 షూటింగ్ ఫుల్ స్వింగ్ 🔥🔥@JiivaOfficial @ysjagan pic.twitter.com/bXMhGy0PyF
— MBYSJ Trends ™ (@MBYSJTrends) September 24, 2023
తాజాగా యాత్ర 2 షూటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. జగన్ పాత్రలో జీవానే నటించబోతున్నాడు. తాజాగా షూటింగ్ కి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో జీవా జగన్ లా మాట్లాడుతున్నట్టు, మైక్ కొడుతున్నట్టు ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. అయితే ఇది టెస్ట్ షూట్ అని తెలుస్తుంది. ఈ వీడియో చూస్తే ఇది నిజంగానే జగన్ అనుకునేలా ఉంది. దీంతో ఈసారి ఎన్నికలకు ముందు కూడా యాత్ర 2 సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి యాత్ర 2 సినిమా జనాలకి ఎంత రీచ్ అవుతుందో, జగన్ లా జీవా ఏ రేంజ్ లో మెప్పిస్తాడా చూడాలి.