Kollywood Hero: భార్య కోసం సింగర్ గా మారిన కేజీఎఫ్ హీరో.. నెట్టింట వీడియో వైరల్?
కేజిఎఫ్ హీరోతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు తన భార్య కోసం సింగర్ గా మారినట్టు తెలుస్తోంది. ఈ విషయం వైరల్ గా మారింది.
- By Anshu Published Date - 12:00 PM, Tue - 11 March 25

యష్.. పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా కేజీఎఫ్. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు యష్. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు యష్. ఒక సాధారణ బస్సు డ్రైవర్ కొడుకు కాస్త ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే కెరియర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్, ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.
ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గీతు మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు గీతు మోహన్ దాస్. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలోనూ నటిస్తున్నాడు.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణ్ గా నటిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లోకూడా జాయిన్ అయ్యాడు యష్. ఇదిలా ఉంటే తాజాగా యష్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే యష్ సతీమణి రాధికా పండిట్ బర్త్ డే జరిగింది. ఆమె బర్త్ డేను యష్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. కాగా భార్య బర్త్ డే సెలబ్రేషన్ లో యష్ సింగర్ గా మారారు. ఆమె కోసం ఒక పాట కూడా పాడాడు యష్. 1981 చిత్రం గీత నుండి జోతేయల్లి అనే క్లాసిక్ పాటను పాడారు. ఈ పాటను స్వరకర్త ఇళయరాజా స్వరపరిచారు, గాయకులు S.P. పాడారు.