Covid Effect On Tollywood: సంక్రాంతి బాక్సాఫీస్ బోసిపోయింది!
సంక్రాంతి అంటే కోళ్ల పందాలు, పాడి పంటలు, పిండి వంటలే కాదు... సంక్రాంతి అంటే సినిమా కూడా. అందుకే చిన్న చిన్న సినిమాలు మొదలుకొని... పెద్ద పెద్ద సినిమాలన్నీ పండుగ రేసులో నిలుస్తుంటాయి.
- By Balu J Published Date - 12:01 PM, Wed - 5 January 22
సంక్రాంతి అంటే కోళ్ల పందాలు, పాడి పంటలు, పిండి వంటలే కాదు… సంక్రాంతి అంటే సినిమా కూడా. అందుకే చిన్న చిన్న సినిమాలు మొదలుకొని… పెద్ద పెద్ద సినిమాలన్నీ పండుగ రేసులో నిలుస్తుంటాయి. ‘నువ్వానేనా’ అన్నట్టు పోటీ పడుతుంటాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. టాలీవుడ్ కు సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు.. ఓ సెంటిమెంట్ కూడా. అందుకే పెద్ద హీరోలు కూడా సెంటిమెంట్ గా భావించి తమ తమ సినిమాలన్నీ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తుంటారు.
అలాంటి సంక్రాంతి పండుగపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ‘ఈ పండుగ నాదే అంటూ’ సినిమాలపై పైచేయి చూపుతోంది. కొవిడ్ ధాటికి పెద్ద పెద్ద సినిమాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూశారు. జనవరి 7న రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను చూసేందుకు ఇరు హీరోల అభిమానులు ఆశపడ్డారు. వాళ్లందరి ఆశలను వమ్ము చేస్తూ ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం.. టికెట్ల రేట్లు కారణంగా ఈ పాన్ ఇండియా మూవీ వాయిదా పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లానాయక్ మూవీ కూడా వాయిదా పడింది. కొవిడ్ ధాటికి ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా వెనక్కి వెళ్లింది. ఎన్నో ఆలోచనల తర్వాత ఈ సినిమాను మార్చి లో విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఇక మనం తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగర్రాజు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మూవీని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తారని, ఈ రిస్క్ టైంలో రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందా? లేదా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బోసిపోయినట్టయింది!
Related News
Samyukta Menon : టాలీవుడ్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ నటించాలంటే కష్టం అంటూ..!
Samyukta Menon టాలీవుడ్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకుని సౌత్ లో సూపర్ పాపులర్ అవుతున్న హీరోయిన్స్ ఒక పాయింట్ లో తెలుగు సినీ పరిశ్రమపై కామెంట్స్