Jack : సిద్ధు రెమ్యూనరేషన్ వెనక్కి ఇస్తాడా..?
Jack : ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం తో వెంటనే 'టిల్లు స్క్వేర్' ను తెరపైకి తీసుకొచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు
- By Sudheer Published Date - 02:07 PM, Tue - 15 April 25

‘డీజే టిల్లు’ (DJ Tillu ) సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఒక్కసారిగా యూత్ లో పాపులర్ అయ్యాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం తో వెంటనే ‘టిల్లు స్క్వేర్’ ను తెరపైకి తీసుకొచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు సిద్ధు కెరీర్‌కు బూస్ట్ ఇవ్వడం తో ఆయన పారితోషకం, సినిమాల బడ్జెట్, బిజినెస్ స్థాయిలు అమాంతం పెరిగాయి. అయితే ఈ విజయాల వల్ల సిద్ధుకు మైనస్ తప్ప ప్లస్ కాలేదు.
Natural Star Nani : ఫ్యాన్స్ కు నాని స్వీట్ వార్నింగ్
తాజాగా సిద్దు జాక్ (Jack) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ..ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. ఈ మూవీ లో ఏజెంట్ పాత్ర లో సిద్దు కొత్తగా ఉండాల్సినప్పటికీ, సిద్ధు మళ్లీ ‘టిల్లు’ మేనరిజమ్స్‌తోనే కనిపించాడు. ఫలితంగా ప్రేక్షకులు ఆయన నుంచి కొత్తదనాన్ని ఆశించినా, అదే పాత షేడ్స్ చూసి నిరుత్సాహపడ్డారు. ఇక ‘టిల్లు’ వసూళ్ల ఆధారంగా ‘జాక్’ బడ్జెట్‌ను ఎక్కువగా పెట్టిన నిర్మాతలు, బయ్యర్లు కూడా గట్టి నష్టాల్ని చవిచూశారు. సినిమా ఓవర్ బడ్జెట్ అయి, ప్రొడ్యూసర్ డెఫిషిట్‌లోకి వెళ్లడం, బయ్యర్లకు పెట్టుబడి తిరిగి రాకపోవడం పరిస్థితిని ఏర్పడింది. ప్రస్తుతం నిర్మాత బయ్యర్లకు సెటిల్ మెంట్ చేసే పని ఉండగా.. సిద్ధు తన పారితోషకం(Siddu Jonnalagadda Remuneration)లో సగం వెనక్కు ఇస్తారనే టాక్ నడుస్తుంది. మరి నిజంగా సిద్దు ఆ పనిచేస్తాడా అనేది చూడాలి.