Nani Srikanth Odela : దేవిశ్రీ లేదా అనిరుద్.. దసరా 2 కి ఎవరు ఫిక్స్..?
Nani Srikanth Odela నాని నెక్స్ట్ సినిమా హిట్ 3 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఐతే ఆ సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్ ఓదెల సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నారు.
- By Ramesh Published Date - 08:38 AM, Sat - 12 October 24

Nani Srikanth Odela న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా దసరా. ఈ సినిమాతో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికేశాడని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక దసరా తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెల తన సెకండ్ సినిమా కూడా నానితోనే ఫిక్స్ చేసుకున్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో దసరా సెకండ్ కాంబో మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమా గురించి నాని (Nani) ఇస్తున్న హింట్స్ అయితే ఫ్యాన్స్ కి అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈమధ్యనే సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని నెక్స్ట్ సినిమా హిట్ 3 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఐతే ఆ సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్ ఓదెల సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేశాడు. దసరా (Dasara 2) నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా కూడా వస్తుంది.
మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్..
ఐతే పూర్తి కాస్టింగ్ ఏంటన్నది తెలియదు కానీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ని కానీ అతను కుదరకపోతే అనిరు రవిచంద్రన్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. నాని శ్రీకాంత్ ఓదెల సినిమా అనగానే ఆడియన్స్ లో తారస్థాయి అంచాన్లు ఉన్నాయి. అందుకు తగినట్టుగానే సినిమా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
దసరా 2 కాంబో సినిమాకు దేవి శ్రీ ప్రసాద్, అనిరుద్ (Anirud) ఇద్దరిలో ఎవరైనా కూడా ఫ్యాన్స్ కి హ్యాపీ అన్నట్టే.. ఈమధ్యనే దేవరతో తన సత్తా చాటాడు అనిరుద్ మరి నాని సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు ఫైనల్ అవుతారన్నది చూడాలి.