Telugu Song : ఆ తెలుగు సాంగ్ హవా.. యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ 20 కోట్ల వ్యూస్
Telugu Song : యూట్యూబ్.. ప్రతి ఒక్కరి ఫేవరేట్ సోషల్ మీడియా యాప్ !! దీనిపై మనకు ఎలాంటి డౌటూ ఉండాల్సిన అవసరం లేదు.
- By Pasha Published Date - 08:32 AM, Mon - 22 April 24
Telugu Song : యూట్యూబ్.. ప్రతి ఒక్కరి ఫేవరేట్ సోషల్ మీడియా యాప్ !! దీనిపై మనకు ఎలాంటి డౌటూ ఉండాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొన్ని ఎంపిక చేసిన చిన్న తరహా సినిమాలను కూడా చాలా తక్కువ టైంలోనే యూట్యూబ్‌లో రిలీజ్ చేసేస్తున్నారు. అంతగా యూట్యూబ్ పబ్లిక్ ట్యూబ్‌గా మారిపోయింది. ఏ సినిమాకు ఏ రేంజులో పబ్లిక్ క్రేజ్ ఉందనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చేందుకు.. ఆయా సినిమాల ట్రైలర్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను ఈ మధ్య జనం బాగా చెక్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ తెలుగు సినిమా సాంగ్ యూట్యూబ్ వేదికపై దుమ్మురేపింది. రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్‌లో ఆ పాటకు 20 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’ పార్ట్- 1. ఈ సినిమాలోని ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ సాంగ్(Telugu Song) ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ మ్యూజిక్ వింటూ అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. గాన మాధుర్యం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్టుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో అలరించిన ఈ పాట యూట్యూబ్‌లో తడాఖా చూపించింది. ఈ పాటకు రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్‌లో 20 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో ఇంత తక్కువ టైంలో ఇన్ని భారీ వ్యూస్ సాధించిన ఏకైక సాంగ్‌గా ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ అప్పియరెన్స్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
Also Read :Gukesh : భళా గుకేశ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడు
తక్కువ రోజుల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు పాటల లిస్టును రూపొందించగా.. అందులో నంబర్ 1 ప్లేసులో ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ నిలిచింది. మూడో ప్లేసులోనూ అల్లు అర్జున్ పాటే నిలిచింది. బన్నీ- పూజా హెగ్డే కాంబినేషన్లో ఉండే ‘బుట్టబొమ్మ బుట్టబొమ్మ’ సాంగ్ 95 రోజుల్లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఈ సాంగ్‌తో నెటిజన్లు సోషల్ మీడియాలో లక్షలాది రీల్స్ చేశారు. దీన్నిబట్టి ఆ సాంగ్‌కు అప్పట్లో లభించిన క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తన పిల్లలతో ఈ పాటకు రీల్స్ చేయడం వైరల్ అయింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు- శ్రీలీల సూపర్ హిట్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ 78 రోజుల్లోనే 20 కోట్ల వ్యూస్‌ను సాధించి ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. ఈ మధ్య గ్రాండ్ ఈవెంట్స్, బర్త్‌డే ఫంక్షన్స్ ఎక్కడ చూసినా ఈ పాటే ఎక్కువగా వినిపిస్తోంది.
Also Read :Daggubati Purandeswari : కేక్ కట్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్.. దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు
Related News
YouTube AI Features : యూట్యూబ్‌లో బోరింగ్ వీడియోలకు చెక్.. ఏఐ ఫీచర్స్ ఇవిగో
YouTube AI Features : వాట్సాప్ కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పుడే అదే బాటలో యూట్యూబ్ కూడా పయనిస్తోంది.