Anupama Parameswaran : లిల్లీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
Anupama Parameswaran టాలీవుడ్ ఎంట్రీ టైం లో చాలా పద్ధతిగా కనిపించి చేసిన పాత్రలను కూడా చాలా హోంలీగా సెలెక్ట్ చేసుకున్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య తన పంథా మార్చేసింది.
- Author : Ramesh
Date : 13-04-2024 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Anupama Parameswaran టాలీవుడ్ ఎంట్రీ టైం లో చాలా పద్ధతిగా కనిపించి చేసిన పాత్రలను కూడా చాలా హోంలీగా సెలెక్ట్ చేసుకున్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య తన పంథా మార్చేసింది. బొద్దుగా ఉన్న తను స్లిం గా మారడమే కాదు సినిమాల విషయంలో తన కమిట్మెంట్ కూడా మార్చుకుంది. గ్లామర్ గా కనిపించడానికి మాక్సిమం ట్రై చేస్తుంది అమ్మడు. ఈ క్రమంలోనే రౌడీ బోయ్స్ సినిమాతో షాక్ ఇచ్చింది.
ఇక టిల్లు స్క్వేర్ లో అయితే అనుపమ ఫ్యాన్స్ కు పండుగే అన్నట్టుగా చేసింది. రెగ్యులర్ టైపు పాత్రలు చేసి బోర్ కొట్టింది అందుకే తను ఇలాంటి పాత్రలు చేస్తున్నానని చెబుతున్న అనుపమ టిల్లు స్క్వేర్ లో లిల్లీ పాత్రతో తన మైలేజ్ పెంచుకుంది. అనుపమ లోని ఈ బోల్డ్ యాంగిల్ ని వాడుకోవాలని మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే లిల్లీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఇయర్ ఈగల్ లో నటించిన అనుపమ ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోగా టిల్లు స్క్వేర్ తో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. ఇక టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ ఎలాంటి సినిమాలు చేస్తుంది. లిల్లీ తరహాలోనే ఇంకాస్త రెచ్చిపోతుందా లేదా మళ్లీ పాత అనుపమలా కనిపిస్తుందా అన్నది ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ మొదలైంది.
ఏది ఏమైనా అనుపమలో ఈ మార్పు ఆడియన్స్ కు మాత్రం కన్నుల విందు చేస్తుంది. అమ్మడు గ్లామర్ సైడ్ టర్న్ అవ్వడం అలాంటి పాత్రలే చేయడం వల్ల కెరీర్ లో ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. సో కెరీర్ లో ఇన్ని సినిమాలు చేసినా బజ్ టిల్లు స్క్వేర్ లిల్లీతో వచ్చింది. మరి ఈ టైం లో అనుపమ నెక్స్ట్ సినిమాలు ఎలా చేయబోతుందో చూడాలి.
Also Read : Double Ismart OTT Deal : డబుల్ ఇస్మార్ట్ OTT డీల్ క్లోజ్.. పూరీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?