Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ వచ్చేసింది.. మాస్ మెకానిక్..
తాజాగా మెకానిక్ రాకీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 05:50 PM, Sun - 20 October 24

Mechanic Rocky : వరుస విజయాలతో దూసుకెలుతున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవితేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ట్రైలర్ చూస్తుంటే మెకానిక్ గా పనిచేసే హీరో జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు విలన్ తో ఓ సమస్య ఉన్నట్టు కమర్షియల్ గా చూపించారు. సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించాడు. మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 22న రిలీజ్ కాబోతుంది. మీరు కూడా మెకానిక్ రాకీ ట్రైలర్ చూసేయండి..
Also Read : Pawan Kalyan : కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్