Vishwak Sen : యూట్యూబర్ పై హీరో విశ్వక్ సేన్ ఆగ్రహం ..
Vishwak Sen : ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే విశ్వక్ సేన్..ఎవరైనా ఎన్టీఆర్ గురించి కానీ , ఎన్టీఆర్ సినిమాల గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవుతూ..ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
- By Sudheer Published Date - 11:56 AM, Thu - 12 September 24

ఎన్టీఆర్ (NTR) అంటే కేవలం సామాన్య ప్రేక్షకులకే కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం..సమయం దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ గురించి తెలుపుతూ వారి అభిమానాన్ని చాటుకుంటుంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే విశ్వక్ సేన్..ఎవరైనా ఎన్టీఆర్ గురించి కానీ , ఎన్టీఆర్ సినిమాల గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవుతూ..ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా దేవర ట్రైలర్ ఫై ఓ యూట్యూబర్ నెగిటివ్ గా మాట్లాడడం ఫై సీరియస్ అయ్యాడు.
శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కొద్దీ రోజుల సమయమే మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన మేకర్స్.. నిన్న మంగళవారం ముంబై లో సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. విడుదలై కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్స్ లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ చేసారు. ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.
కాగా దేవర ట్రైలర్ ఫై కొంతమంది నెగిటివ్ ప్రచారం చేయడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మీకు ట్రైలర్ నచ్చకపోతే ఓకే దాన్ని యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టి.. ఇదిలా ఇలా చేయాలి. అది అలా ఉండాలి అంటూ వీడియోలు చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవర ట్రైలర్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ పై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. దేవర ట్రైలర్ పై ఓ యూట్యూబర్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ట్రైలర్ మీద, ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్మూబర్లు ఇద్దరు ట్రోలింగ్ చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ.. ట్రైలర్ చూడబుద్ది కాలేదని ఒకరు అంటే.. ట్రైలర్ ఏమంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నచ్చలేదని ఇంకొకరు అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు. దాంతో విశ్వక్ సేన్ కు కోపం వచ్చింది . నిజానికి వాళ్ల మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా కోపం వస్తుంది. దాంతో ఆ ఇద్దరినీ విశ్వక్ ఏకిపారేశారు. ముందు నువ్వు ఆ గోడ సాయం లేకుండా 2 నిముషాలు నిల్చొండి ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయినా నాకు కాలిపోతుంది నిన్ను చూస్తుంటే.. ఏమైనా చేద్దామంటే.. మీ మొహం కాలిపోయినట్టే ఉంది ఏం చేస్తాం.. ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : MLA Kaushik Reddy House Arrest : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గృహనిర్బంధం