Chhaava Effect : గుప్తనిధుల కోసం పోటీపడ్డ గ్రామస్థులు
Chhaava Effect : గ్రామస్థులందరూ కలసికట్టుగా కోట వద్ద రహస్యంగా తవ్వకాలు (Excavations) చేపట్టారు. పాత కథలు, వదంతులు కలసి నిజం అయ్యే అవకాశం ఉందని భావించిన స్థానికులు, భారీగా తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు
- By Sudheer Published Date - 10:29 AM, Sat - 8 March 25

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛావా’ (Chhaava) ప్రేక్షకులపై గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్య కాలంలో మరాఠాలతో జరిగిన యుద్ధాల్లో దోచుకున్న విలువైన ధనాన్ని మొఘలులు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ సమీపంలోని ఆసిరఢ్ కోటలో భద్రపరిచారని చూపించారు. ఈ కథాంశం స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. మూవీ కథ నిజమేనని నమ్మిన గ్రామస్థులు కోట వద్ద రాత్రివేళల తవ్వకాలకు పాల్పడటం ప్రారంభించారు.
MLA Quota MLCs: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. కీలక అప్‌డేట్
గ్రామస్థులందరూ కలసికట్టుగా కోట వద్ద రహస్యంగా తవ్వకాలు (Excavations) చేపట్టారు. పాత కథలు, వదంతులు కలసి నిజం అయ్యే అవకాశం ఉందని భావించిన స్థానికులు, భారీగా తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొందరు తమకు తెలిసిన పురాతన గ్రంథాలు, చారిత్రక ఆధారాలను ఆధారం చేసుకుని, మరికొందరు వృద్ధుల దగ్గర వినిపించిన కథల ఆధారంగా కోట వద్ద రాత్రివేళల్లో నిద్ర మరిచి తవ్వకాల్లో పాల్గొన్నారు.
తవ్వకాల విషయం తెలుసుకున్న పోలీసులు అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం నేరమని గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ప్రాంతానికైనా తవ్వకాలు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. కోట చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, దీనిని భవిష్యత్తు తరాలకు భద్రపరిచేలా చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Women’s Day : నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ..మహిళలకు వరాల జల్లు