Vikram Thangalaan : తమిళ మేకర్స్ కి ఆ మాత్రం తీరిక లేదా.. ఎందుకిలా చేస్తున్నారు..?
Vikram Thangalaan కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం క్రేజీ డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో వస్తున్న సినిమా తంగళాన్. విక్రం సినిమా అంటే విచిత్ర వేషాలు..
- By Ramesh Published Date - 03:54 PM, Sun - 29 October 23
Vikram Thangalaan కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం క్రేజీ డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో వస్తున్న సినిమా తంగళాన్. విక్రం సినిమా అంటే విచిత్ర వేషాలు.. రకరకాల పాత్రలు ఉంటాయని తెలిసిందే. అపరిచితుడు టైంలో విక్రం చేసిన ఈ ప్రయోగాలు నచ్చిన ప్రేక్షకులు అతని సినిమాలో ఇవి కామన్ అవడంతో బోర్ కొట్టేశాయి. అందుకే ఈమధ్య విక్రం (Vikram) సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందించలేదు.
ప్రస్తుతం పా రంజిత్ (Pa Ranjith) తో చేస్తున్న తంగళాన్ సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు. ముఖ్యంగా ఈ సినిమా తమిళ టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకోవడంలో లాజిక్ ఏంటన్నది అర్ధం కావట్లేదు. గనళాన్ అంటే ఏంటో తెలుగులో అర్ధం తెలియదు. అలాంటిది ఈ సినిమాను చూసేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తారన్నది చూడాలి.
తంగళాన్ సినిమా విషయంలో తెలుగులో అంతగా బజ్ లేదు. ఎందుకంటే విక్రం సినిమాలు ఏవి ఈమధ్య హిట్ పడలేదు. తమిళ్ లోనే తంగళాన్ (Thangalaan) కి అటు ఇటుగా బజ్ ఉంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న తంగళాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. తంగళాన్ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. పా రంజిత్ సినిమా అంటే ఆడియన్స్ లో మంచి బజ్ ఉంటుంది. కానీ పాన్ ఇండియా రేంజ్ లో తంగళాన్ సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాలి.
Also Read : MS Dhoni: టీమిండియా or CSK ? ధోనీ అదిరిపోయే ఆన్సర్
We’re now on WhatsApp : Click to Join