Pawan Kalyan : పవన్‌ని ఎంతో అభిమానించే విజయేంద్ర ప్రసాద్.. ఫస్ట్ మీటింగ్‌లో అవమానించారట..
పవన్‌ని ఎంతో అభిమానించే విజయేంద్ర ప్రసాద్.. ఫస్ట్ మీటింగ్‌లో మాత్రం పవన్ ఎవరో తెలియక అవమానించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
- By News Desk Published Date - 05:05 PM, Fri - 26 April 24

Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎంతలా అభిమానిస్తారో తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఆయనే స్వయంగా పవన్ పై తన అభిమానాన్ని చెప్పుకొచ్చారు. ఇక ఆ ఇష్టం ఎలాంటిది అంటే.. ఏదో పవన్ సినిమాలు చూసి ఆనందించడం మాత్రం అయితే కాదు. పవన్ పై తన ఇష్టాన్ని విజయేంద్ర ప్రసాద్.. తన వర్క్ లో చూపిస్తూ వచ్చారు.
రైటర్ గా తాను రాసే సన్నివేశాలను కూడా విజయేంద్ర ప్రసాద్.. పవన్ నుంచి స్ఫూర్తి పొంది రాసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ పై ఈయన చూపించే అభిమానానికి పవన్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతుంటారు. అయితే పవన్ ని ఇంతలా అభిమానించే విజయేంద్ర ప్రసాద్.. ఫస్ట్ మీటింగ్‌లో మాత్రం పవన్ ఎవరో తెలియక అవమానించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పవన్ ని మొదటిసారి ఓ మెడిటేషన్ క్లాస్ లో కలుసుకున్నారట. 2000 సంవత్సరంలో చెన్నై నుంచి హైదరాబాద్ మకాం మార్చిన విజయేంద్ర ప్రసాద్.. తన ఫ్రెండ్ కె ఎల్ ప్రసాద్ తో కలిసి ఓ మెడిటేషన్ సెంటర్ కి వెళ్లారు. ఇక అక్కడ ఉన్న ఒక కుర్రాడిని కె ఎల్ ప్రసాద్.. తీసుకొచ్చి విజయేంద్ర ప్రసాద్ కి పరిచయం చేశారట. ఆ కుర్రాడిని పలకరించిన విజయేంద్ర ప్రసాద్.. ప్రత్యేకంగా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నావు, అతడు ఎవరని ప్రశ్నించారట. ఆ కుర్రాడు ఎవరో కాదు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ అప్పటికే.. తొలిప్రేమ, తమ్ముడు వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తెలుగు యువతలో పవన్ పేరు ఓ రేంజ్ లో మారుమోగుతోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ని పట్టుకొని ఎవరు అని అడిగి తెలియక అవమానించారట. పవన్ లాంటి ఓ స్టార్ అక్కడ ఒక చిన్న మెడిటేషన్ సెంటర్ లో ఎందుకు ఉంటారు అనే ఆలోచనతో ఉన్న విజయేంద్ర ప్రసాద్.. పవన్ ని గుర్తించలేకపోయారట. అందుకనే పవన్ ని గుర్తించలేక.. నువ్వు ఎవరని అవమానించారట. ఇక ఆ తరువాత పవన్ గురించి, తన మనస్తత్వం గురించి తెలుసుకున్న విజయేంద్ర ప్రసాద్.. పవన్ కి వీరాభిమాని అయ్యిపోయారట.
Also read : Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!