Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.
- By Balu J Published Date - 04:59 PM, Mon - 16 May 22
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్
ప్రారంభించుకుంది. ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు.
విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.
Related News
Dil Raju: కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ : నిర్మాత దిల్ రాజు
Dil Raju: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ పై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియే